Rahul Gandhi | లంచాలు, కమిషన్లు తీసుకునేందుకే ఎన్నికల బాండ్లు : మోదీ సర్కార్‌పై రాహుల్ గాంధీ ఫైర్
Rahul Gandhi : ఎన్నికల బాండ్ల జారీని నిలిపివేయాలని సుప్రీంకోర్టు గురువారం ఆదేశించిన క్రమంలో ఈ అంశంపై కాంగ్రెస్ అగ్రనేత, ఆ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ స్పందించారు. ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యంగా రాహుల్ విమర్శలు గుప్పించారు.
Rahul Gandhi : ఎన్నికల బాండ్ల జారీని నిలిపివేయాలని సుప్రీంకోర్టు గురువారం ఆదేశించిన క్రమంలో ఈ అంశంపై కాంగ్రెస్ అగ్రనేత, ఆ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ స్పందించారు. ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యంగా రాహుల్ విమర్శలు గుప్పించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పధకం లంచాలు, కమిషన్లకు మాధ్యమంగా ఉపయోగపడిందని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. నరేంద్ర మోదీ మరో అవినీతి విధానాలకు ఇప్పుడు మరో నిదర్శనం ప్రజల ముందు బట్టబయలైంది. లంచాలు, కమిషన్లు తీసుకునేందుకు సాధనంగా మోదీ ప్రభుత్వం ఎన్నికల బాండ్లను తీసుకువచ్చిందని రాహుల్ ఆరోపించారు.
సర్వోనత్న న్యాయస్ధానం ఉత్తర్వులతో ఈ విషయం స్పష్టమైందని అన్నారు. కాగా, ఎలక్టోరల్ బాండ్ల(Electoral Bonds)పై ఇవాళ సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది. సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని అయిదుగురు సభ్యుల ధర్మాసనం ఆ తీర్పును ఇచ్చింది. కేంద్ర సర్కారు ప్రవేశపెట్టిన ఎలక్టోరల్ బాండ్ల స్కీమ్‌కు చట్టబద్ధత ఉంటుందా లేదా అన్న పిటీషన్లపై కోర్టు తీర్పును వెలువరించింది. బ్లాక్ మనీ సమస్యను పరిష్కరించేందుకు పోల్ బాండ్స్ స్కీమ్ ఒక్కటే పరిష్కారం కాదు అని కోర్టు పేర్కొన్నది.
జస్టిస్ సంజీవ్ ఖన్నా, బీఆర్ గవాయి, జేబీ పర్దివాలా, మనోజ్ మిశ్రాలు ఆ ధర్మాసనంలో ఉన్నారు.ఎలక్టోరల్ బాండ్ల స్కీమ్ రాజ్యాంగ వ్యతిరేకమని సీజేఐ చంద్రచూడ్ తెలిపారు. ఆర్పీఏ, ఐటీ చట్టంలో 29(1)సెక్షన్ సవరణ రాజ్యాంగ వ్యతిరేకం అవుతుందన్నారు. ఎలక్టోరల్ బాండ్లను జారీ చేసే బ్యాంకులు తక్షణమే బాండ్లను నిలిపివేయాలని కోర్టు తన తీర్పులో తెలిపింది. నిధులు అందుకున్న రాజకీయ పార్టీలు వివరాలను ఎస్బీఐ బ్యాంకు వెల్లడించాలని కోర్టు కోరింది. మార్చి 6వ తేదీలోగా ఎన్నికల సంఘానికి ఆ వివరాలను ఇవ్వాల్సి ఉంటుంది. ప్రతి బాండ్‌కు చెందిన వివరాలను ఎస్బీఐ వెల్లడించాలి.
Read More :
Lovers Suicide | ప్రేమలో కజిన్స్.. ప్రేమికుల దినోత్సవం నాడు సూసైడ్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కశ్మీర్ బస్సులపై రెండ్రోజుల్లో రెండు దాడులు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

