Rahul Gandhi | పోలీసుల దాడిలో వినికిడి శక్తి కోల్పోయిన విద్యార్థిని.. ఢిల్లీ పోలీసులపై రాహుల్ గాంధీ ఆగ్రహం
Rahul Gandhi : ఢిల్లీ పోలీసులపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు దారుణంగా ప్రవర్తించారని ఆరోపించారు.
Rahul Gandhi : ఢిల్లీ పోలీసులపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు దారుణంగా ప్రవర్తించారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగమైన ఎన్ఎస్యూఐతోపాటు, ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన విద్యార్థులపై పోలీసులు తీవ్రంగా దాడి చేశారని రాహుల్ ఆరోపించారు. అందులోనూ మహిళా విద్యార్థులపై దాడి చేశారని, పోలీసుల దాడుల్లో గాయపడ్డ ఒక విద్యార్థినికి వినికిడి సమస్య ఎదురైందని రాహుల్ విమర్శించారు.
మరో విద్యార్థిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ, ఇండియా బ్లాక్, సీజేపీ, ఆప్, ఇతర విద్యార్థి సంఘాలు ఢిల్లీలో కొద్దిరోజులుగా ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మంగళవారం ఆందోళన చేసిన విద్యార్థులపై ఢిల్లీ పోలీసులు దాడికి పాల్పడ్డారు. వీరిలో కేరళకు చెందిన అథిర అనే ఒక విద్యార్థినిపై దాడి జరగగా.. ఆమె ఒక చెవి వినికిడి శక్తి సమస్య ఎదుర్కొంటున్నట్లు రాహుల్ గాంధీ మీడియాకు తెలిపారు. ఆమె చెవిపై పోలీసులు దాడి చేయడం వల్ల ఒకవైపు వినికిడి శక్తి కోల్పోయిందన్నారు.
గతంలో ఇలాగే, పోలీసుల దాడుల్లో కంటి చూపు కోల్పోయిన ఒక అబ్బాయిని చూపించానని, ఈసారి దాడుల్లో ఇంకొకరికి చెవుడు వచ్చిందని రాహుల్ ఆరోపించారు. బాధిత యువతిని రాహుల్ మీడియాకు చూపించారు. ఈ సందర్భంగా బాధిత యువతి మీడియాతో మాట్లాడింది. తమను పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లారని, ఈ సమయంలో మహిళా పోలీసులు తమతో లేరని ఆరోపించారు. అలాగే, తమను తీసుకెళ్తున్న బస్సును కన్నాట్ పోలీస్ స్టేషన్ వద్ద ఆపి, తమపై వరుసగా దాడి చేశారని ఆమె పేర్కొన్నారు.
కేరళకు చెందిన తాను ఢిల్లీ యూనివర్సిటీలో చదువుకుంటున్నట్లు చెప్పారు. తమను అరెస్టు చేసి తీసుకెళ్తున్న బస్సులో మహిళా పోలీసు అధికారులే లేరని ఆరోపించారు. మరికొందరు విద్యార్థినులపై మహిళా కానిస్టేబుళ్లు దాడి చేసినట్లు రాహుల్ వివరించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress | మా ముందుకొచ్చి మాట్లాడే దమ్ముందా?.. కాంగ్రెస్ నేతలకు రైతు సవాల్
Malasiya | భారతీయులకు మలేషియా షాక్.. వీసా ఫ్రీ ఎంట్రీ నిలిపివేత
Aadhar Card | ‘పుట్టిన తేదీకి ఆధార్ కార్డ్ ధ్రువపత్రం కాదు’
PF Withdraw | ఇకపై నెలనెలా పీఎఫ్ విత్‌డ్రా.. సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్‌కు ఈపీఎఫ్‌వో ఆమోదం
Shah Rukh Khan | షారుఖ్ఖాన్అరుదైన ఘనత.. ది 100 గ్రేటెస్ట్ మూవీ స్టార్స్ ఆఫ్ ఆల్‌టైమ్ జాబితాలో చోటు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

