కాషాయ పార్టీ ఆదాయం 50 శాతం ఎగబాకింది..మరి మీ సంగతేంటి : రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ : ఎలక్టోరల్ బాండ్ల ద్వారా విరాళాల వెల్లువతో 2019-20లో బీజేపీ ఆదాయం 50 శాతం పెరిగిందని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) నివేదిక ఆధారంగా కాషాయ పార్టీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చురకలు వేశారు. 2019-20లో బీజేపీ ఆదాయం 50 శాతం పెరిగిందనే వార్తా కధనాన్ని ట్విటర్లో రాహుల్ షేర్ చేస్తూ బీజేపీ రాబడి 50 శాతం పెరిగింది మరి మీ ఆదాయం సంగతేంటి..? అని రాహుల్ ట్వీట్ చేశారు.
2018-19, 2019-20 మధ్య బీజేపీ ఆదాయం రూ 2410 కోట్ల నుంచి రూ 3623 కోట్లకు పెరిగిందని, ఈ వ్యవధిలో కాషాయ పార్టీ రాబడి ఏకంగా 50.34 శాతం వృద్ధి చెందిందని ఏడీఆర్ నివేదిక శుక్రవారం వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇక ఇదే సమయంలో కాంగ్రెస్ ఆదాయం రూ 918 కోట్ల నుంచి రూ 682 కోట్లకు పడిపోయిందని ఏడీఆర్ పేర్కొంది. ఇక ఎన్సీపీ ఆదాయం అత్యధికంగా 68.77 శాతం పెరగడం గమనార్హం. 2018-19లో ఎన్సీపీ ఆదాయం రూ 50.7 కోట్లుగా నమోదవగా 2019-20లో అది రూ 85.5 కోట్లకు ఎగిసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Brain Fog | రాత్రి సరిగ్గా నిద్రించినా ఉదయం తల భారంగా ఉంటుందా.. అందుకు కారణాలు ఇవే..
Harish Rao | కేసీఆర్ దీక్షా దివస్ లేకపోతే.. రేవంత్ రెడ్డి సీఎం అయ్యేవాడే కాదు : హరీశ్ రావు
Jagdeep Dhankhar | మాజీ ఉప రాష్ట్రపతి ధంఖర్‌కు.. ఏడాదిపైగా కేటాయించని అధికార నివాసం
తెలంగాణ ప్రజల్లో ఉద్యమ జ్వాలాను రగిలించిన రోజే దీక్ష దివస్ : రవీంద్ర కుమార్
CPI | ‘రూ.10 వేల కోట్లతో తెలంగాణ ఉద్యమకారుల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి..’
ట్రెండింగ్ వార్తలు
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!

