MSP | కనీస మద్దతు ధరపై స్వామినాధన్‌ను అవమానించేలా కేంద్రం తీరు : రాహుల్ గాంధీ
MSP : రైతుల నిరసనలపై కేంద్ర ప్రభుత్వ తీరును కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మంగళవారం ఎండగట్టారు. ఎంఎస్పీ (కనీస మద్దతు ధర)పై గందరగోళాన్ని వ్యాప్తి చేస్తున్న వారు హరిత విప్లవ పితామహుడు, భారత్ రత్న డాక్టర్ ఎంఎస్ స్వామినాధన్‌ను అవమానిస్తున్నారని అన్నారు.
MSP : రైతుల నిరసనలపై కేంద్ర ప్రభుత్వ తీరును కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మంగళవారం ఎండగట్టారు. ఎంఎస్పీ (కనీస మద్దతు ధర)పై గందరగోళాన్ని వ్యాప్తి చేస్తున్న వారు హరిత విప్లవ పితామహుడు, భారత్ రత్న డాక్టర్ ఎంఎస్ స్వామినాధన్‌ను అవమానిస్తున్నారని అన్నారు. ఐదేండ్ల పాటు ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా కనీస మద్దతు ధరకు పప్పు ధాన్యాలు, మొక్కజొన్న, పత్తిని సేకరిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నేపధ్యంలో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు.
కేంద్ర ప్రతిపాదన రైతుల ప్రయోజనాలను కాపాడేలా లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా రైతులు బుధవారం తిరిగి ఛలో ఢిల్లీ ప్రదర్శనను పునరుద్ధరించనున్నారు. కేంద్రం, రైతుల మధ్య చర్చల నేపధ్యంలో ఈ ప్రదర్శనను సోమవారం తాత్కాలికంగా నిలిపివేశారు. ఎంఎస్పీ హామీ ద్వారా వ్యవసాయంలో పెట్టుబడులు పెరుగుతాయని, గ్రామీణ భారతంలో డిమాండ్ పెరుగుతుందని, రైతులు సైతం విభిన్న పంటలను సాగు చేసేలా అన్నదాతల్లో భరోసా కలుగుతుందని రాహుల్ ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు.
రూ. 14 లక్షల కోట్ల బ్యాంకు రుణాల మాఫీ, రూ. 1.8 లక్షల కోట్ల కార్పొరేట్ ట్యాక్స్ మినహాయింపు ఇచ్చిన దేశంలో రైతుల కోసం చిన్నపాటి ఖర్చుకు కూడా ప్రభుత్వం ఎందుకు వెనుకాడుతోందని ప్రశ్నించారు. ఇక తమ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రాగానే రైతుల పంటలకు ఎంఎస్పీ దక్కేలా కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పిస్తుందని రాహుల్ ఇప్పటికే హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
Read More :
America | అమెరికాలో కోతుల కోసం మినీ సిటీ.. ఎందుకో తెలుసా?
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- confusion
- msp
- Pm Modi
- Rahul Gandhi
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

