Radhakishan Damani: బిలియనీర్ల జాబితాలో కొత్తగా చేరిన భారతీయుడీయనే

న్యూఢిల్లీ: డీమార్ట్ వ్యవస్థాపకుడు రాధాకిషన్ దమాని ( Radhakishan Damani ) ఇప్పుడు బిలియనీర్ల జాబితాలో చేరాడు. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ప్రపంచంలోని వంద మంది సంపన్నుల జాబితాలో ఆయన స్థానం సంపాదించారు. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. దమాని ప్రస్తుత ఆస్తి విలువ సుమారు 19.3 బిలియన్ల డాలర్లు. ప్రపంచంలోని వంద మంది సంపన్నుల జాబితాలో ఆయన 97వ ర్యాంక్‌లో ఉన్నారు. ఈ ఏడాది ఆయన సంపద 30 శాతం పెరిగింది. డీమార్ట్ స్టాక్ విలువ పెరగడంతో.. ఆయన సంపాదన కూడా రెట్టింపు అయ్యింది.
డీమార్ట్ పేరుతో హైపర్‌మార్కెట్ చైన్‌ను దమాని నడిపిస్తున్నాడు. దేశవ్యాప్తంగా సుమారు రెండు వందలకు పైగా డీమార్ట్ స్టోర్స్ ఉన్నాయి. ఫుడ్ ఐటమ్స్, దుస్తులు, కస్టమర్ వస్తువులను ఆ దుకాణాల్లో అమ్ముతుంటారు. 2020 ఆర్థిక సంవత్సరంలో .. డీమార్ట్ పేరెంట్ సంస్థ అవెన్యూ సూపర్‌మార్ట్స్ సుమారు 25వేల కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది.
దమాని ముంబైలో పుట్టారు. స్టాక్ మార్కెట్లలో పెట్టుబడుల ద్వారా తన వ్యాపారాన్ని వృద్ధి చేశారు. 2000 సంవత్సరంలో స్టాక్ మార్కెట్‌ను వదిలిన ఆయన.. మల్టీ బిలియన్ రిటేల్ సామాజ్రాన్ని స్థాపించారు. 2002లో తొలిసారి డీమార్ట్ స్టోర్ ఓపెనైంది. నవీ ముంబైలోని పొవాయిలో ఆ షాపును ఓపెన్ చేశారు. మహారాష్ట్ర, గుజరాత్, ఏపీ, మధ్యప్రదేశ్, కర్నాటక, తెలంగాణ, చత్తీస్ఘడ్, ఢిల్లీ, తమిళనాడు, పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో సుమారు 238 డీమార్ట్ రిటేల్ దుకాణాలు ఉన్నాయి.
బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ జాబితాలో భారత్‌కు చెందిన ముఖేశ్ అంబానీ, గౌతమ్ అదానీ, ఆజిమ్ ప్రేమ్‌జీ, పల్లోంజి మిస్త్రీ, శివ్ నాడర్, లక్ష్మీ మిట్టల్ ఉన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

