PM Modi | రష్యా – ఉక్రెయిన్ వివాద పరిష్కారానికి భారత్ పూర్తి మద్దతు : ప్రధాని మోదీ
PM Modi | రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi ) బుధవారం ఇరు దేశాధినేతలతో ఫోన్లో మాట్లాడారు. రష్యా-ఉక్రెయిన్ వివాదం వీలైనంత త్వరగా శాంతియుతంగా పరిష్కారం అయ్యేలా జరిగే ప్రయత్నాలకు భారత్ పూర్తి మద్దతు ఇస్తుందని ఈ సందర్భంగా మోదీ హామీ ఇచ్చినట్లు సమాచారం.
PM Modi | రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi ) బుధవారం ఇరు దేశాధినేతలతో ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ (Putin) , ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ (Zelenskyy) ప్రధాని మోదీని లోక్‌సభ ఎన్నికల తర్వాత తమ దేశాల్లో పర్యటించాలని ఆహ్వానించినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే, వారి ఆహ్వానాన్ని మోదీ అంగీకరించారా..? లేదా..? అన్నదానిపై స్పష్టత లేదు. ఇక ప్రధాని మోదీ చివరిసారిగా 2018లో రష్యాలో పర్యటించిన విషయం తెలిసిందే.
ముందుగా పుతిన్‌తో మాట్లాడిన మోదీ.. ఇటీవలే జరిగిన ఆ దేశ అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి గెలుపొంది అత్యున్నత పదవి చేపట్టినందుకు ముందుగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా ఉక్రెయిన్‌తో వివాద పరిష్కారానికి చర్చలు, దౌత్యపరమైన చర్యలే మేలని సూచించినట్లు సదరు వర్గాలు తెలిపాయి. భవిష్యత్తులో ఇరు దేశాల బంధం మరింత బలపడాలని, కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నట్టు పేర్కొన్నాయి.
అదేవిధంగా భారత్-ఉక్రెయిన్ బంధం బలోపేతం చేయడంపై అధ్యక్షుడు జెలెన్స్కీతో మోదీ చర్చించారు. ప్రస్తుతం యుద్ధం ముగింపునకు, శాంతిస్థాపనకు తమ పూర్తి మద్దతు ఉంటుందన్నారు. యుద్ధం నేపథ్యంలో ప్రజల అవసరాల మేరకు భారత్ మానవతాసాయం కొనసాగిస్తుందని హామీ ఇచ్చినట్టు తెలిసింది. రష్యా-ఉక్రెయిన్ వివాదం వీలైనంత త్వరగా శాంతియుతంగా పరిష్కారం అయ్యేలా జరిగే ప్రయత్నాలకు భారత్ పూర్తి మద్దతు ఇస్తుందని ఈ సందర్భంగా మోదీ హామీ ఇచ్చినట్లు సమాచారం.
Also Read..
S S Karthikeya | జపాన్‌లో భూకంపం.. ప్రమాదం నుంచి తప్పించుకున్న రాజమౌళి కొడుకు
Solar Eclipse | ఏప్రిల్ 8న సంపూర్ణ సూర్యగ్రహణం.. ఆ దేశంలో అంధకారం
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

