Solar Eclipse | ఏప్రిల్ 8న సంపూర్ణ సూర్యగ్రహణం.. ఆ దేశంలో అంధకారం
వచ్చే నెల 8న ఖగోళంలో అద్భుతం జరుగనుంది. ఈ ఏడాది మొదటి సంపూర్ణ సూర్యగ్రహణం ఆ రోజున సంభవించనుంది. సాధారణంగా భూమికి సూర్యుడికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. అప్పుడు కొంత సమయం చీకటిగా మారుతుంది.
న్యూయార్క్: వచ్చే నెల 8న ఖగోళంలో అద్భుతం జరుగనుంది. ఈ ఏడాది మొదటి సంపూర్ణ సూర్యగ్రహణం (Solar Eclipse) ఆ రోజున సంభవించనుంది. సాధారణంగా భూమికి సూర్యుడికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. అప్పుడు కొంత సమయం చీకటిగా మారుతుంది. అయితే భూమి, సూర్యునికి మధ్య వచ్చిన చంద్రుడు వృత్తాకారం సూర్యుడిని పూర్తిగా కప్పేస్తే సంపూర్ణ సూర్యగ్రహణం (Total Solar Eclipse) సంభవిస్తుంది. దీనికారణంగా సూర్యుని కిరణాలు భూమిని చేరుకోలేవు. దీంతో కొన్ని ప్రాంతాల్లో పూర్తిగా అంధకారం ఏర్పడుంది.
ఏప్రిల్ 8న రానున్న సూర్యగ్రహణం వల్ల అమెరికాలోని చాలా ప్రాంతాల్లో చీకటి కమ్ముకోనుంది. దీంతో వందలాది స్కూళ్లకు ఇప్పటికే సెలవులు ప్రకటించారు. గతేడాది అక్టోబర్ 14న ఏర్పడిన రింగ్ ఆఫ్ ఫైర్ తర్వాత వస్తున్న ఈ సంపూర్ణ సూర్యగ్రహణాన్ని వీక్షించడానికి ప్రజలు సిద్ధమవుతున్నారు. మెక్సికోలో ప్రారంభం కానున్న సంపూర్ణ సూర్యగహ్రణం.. అమెరికాలోని టెక్సాస్, ఓక్లాహామా, అర్కాన్సాస్, మిస్సౌరి, ఇల్లినాయిస్, కెంటకీ, ఇండియానా, ఓహియో, పెన్సిల్వేనియా, న్యూయార్క్, వెర్మాంట్, న్యూ హ్యాంప్‌షైర్, మైన్ రాష్ట్రాల మీదుగా కెనడాకు తరలనుంది. దీంతో ఈ రాష్ట్రాల్లో గ్రహణ సమయంలో పూర్తిగా చీకట్లు కమ్ముకోనున్నాయి. అదేవిధంగా టెన్నెస్సీ, మిచిగాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో సంపూర్ణ సూర్యగ్రహణం కనువిందు చేయనుంది.

సుదీర్ఘ సూర్యగ్రహణం..
గత 50 ఏళ్లలో ఇదే సుదీర్ఘ సూర్యగ్రహణం. భారత కాలమానం ప్రకారం ఏప్రిల్ 8న తేదీ అమావాస్య తిధి రాత్రి 9.12 గంటలకు సూర్యగ్రహణం ప్రారంభమై తెల్లవారు జామున 1.25 గంటలకు ముగియనుంది. అంటే ఈ గ్రహణం మొత్తం సమయం 4 గంటల 39 నిమిషాల పాటు ఉండనుంది. దీంతో ఏప్రిల్ 8న సంభవించే సూర్యగ్రహణం ఈ సంవత్సరంలోనే అత్యంత సుదీర్ఘమైన సూర్యగ్రహణం అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతేకాదు సంపూర్ణ సూర్యగ్రహణ అద్భుతమైన దృశ్యం 50 సంవత్సరాల క్రితం కనిపించింది. ఇప్పుడు ప్రజలు ఈ సంవత్సరం మళ్లీ చూడగలరని అంటున్నారు. అయితే ఇది భారత్‌లో కనిపించదు.

రింగ్ ఆఫ్ ఫైర్
గతేడాది అక్టోబర్ 14న ఏర్పడిన సంపూర్ణ సూర్యగ్రహణానికి ఓ ప్రత్యేకత ఉంది. సూర్యగ్రహణం సమయంలో అత్యంత అరుదుగా ఏర్పడే ‘రింగ్ ఆఫ్ ఫైర్’ (ఉంగరం ఆకృతిలో సూర్య వలయం) ఆకాశంలో ఆవిష్కృతమైంది. ఇది అమెరికా, మెక్సికో సహా దక్షిణ, మధ్య అమెరికాలోని పలు దేశాల్లో మాత్రమే కనపడింది. ఈ దేశాల్లో ‘రింగ్ ఆఫ్ ఫైర్’ చివరిసారి 2012లో కనిపించగా, తర్వాత 2046లో రానుంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Canada
- darkness
- Mexico
- Ring of Fire
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

