భువనేశ్వర్ : పూరి జగన్నాథుడి పేరు మీద రూ.1,912 కోట్ల బ్యాంక్ డిపాజిట్లతో పాటు, 60,821 ఎకరాల భూములు ఉన్నాయని ఆలయ పరిపాలన విభాగం ఓ ప్రకటనలో గురువారం తెలిపింది. ఈ భూములు దేశ వ్యాప్తంగా ఉన్నట్టు మేనేజ్మెంట్ వెల్లడించింది. అలాగే దాని రత్న భండార్లో బంగారు ఆభరణాలు, వజ్రాలు ఉన్నట్టు ఆలయ అధికారులు తెలిపారు. మూడు స్కీముల కింద బ్యాంకు డిపాజిట్లను పొందుపరిచినట్టు తెలిపారు. రూ.1,311 కోట్లు వివిధ ప్రభుత్వ బ్యాంకుల్లో, రూ.500 కోట్లు కార్పస్ ఫండ్ కింద ఒడిశా ప్రభుత్వం పొందుపరిచినట్టు చెప్పారు. రూ.100.71 కోట్లు వివిధ సేవింగ్స్, కరెంట్ ఫ్లెక్సీ అకౌంట్లలో ఉన్నాయని వివరించారు.