Punjab CM | రోడ్డు ప్రమాద మృతులకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించిన భగవంత్ మాన్..!
Punjab CM | రోడ్డు ప్రమాదం (Road Accident) లో మృతిచెందిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం చెల్లించనన్నట్లు పంజాబ్ ముఖ్యమంత్రి (Punjab CM) భగవంత్ మాన్ (Bhagawanth Mann) తెలిపారు. తారన్తరన్ జిల్లాలో రెండు బస్సులు ఢీకొన్న ప్రమాదంలో నలుగురు యాత్రికులు, మోటార్ సైకిల్ వెనుక కూర్చున్న మరో వ్యక్తి మరణించారు. వారికి ఒక్కొక్కరికి రూ.5 లక్షల పరిహారాన్ని ప్రకటించారు.
Punjab CM : రోడ్డు ప్రమాదం (Road Accident) లో మృతిచెందిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం చెల్లించనన్నట్లు పంజాబ్ ముఖ్యమంత్రి (Punjab CM) భగవంత్ మాన్ (Bhagawanth Mann) తెలిపారు. తారన్తరన్ జిల్లాలో రెండు బస్సులు ఢీకొన్న ప్రమాదంలో నలుగురు యాత్రికులు, మోటార్ సైకిల్ వెనుక కూర్చున్న మరో వ్యక్తి మరణించారు. వారికి ఒక్కొక్కరికి రూ.5 లక్షల పరిహారాన్ని ప్రకటించారు.
అదేవిధంగా ప్రమాదంలో గాయపడిన వారికి ఒక్కొక్కరికి రూ.1 లక్ష చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు తెలిపారు. శనివారం నౌషెహ్రా పన్నూన్ సమీపంలో జాతీయ రహదారి-54 పై పంజాబ్ ప్రభుత్వానికి చెందిన రెండు బస్సులు ఢీకొన్న ఘటనలో నలుగురు యాత్రికులు, మోటార్‌సైకిల్‌పై వెనుక కూర్చున్న మరో వ్యక్తి మరణించారు. మరో 15 మందికిపైగా గాయపడ్డారు. గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకోవడానికి ఆదివారం అమృత్‌సర్‌లోని ఆస్పత్రిని సందర్శించిన మాన్ విలేకరులతో మాట్లాడుతూ ఈ ఘటనను దురదృష్టకరమైనదిగా అభివర్ణించారు.
మోటార్‌సైకిల్‌ను తప్పించే ప్రయత్నంలో బస్సు డ్రైవర్లలో ఒకరు రోడ్డు డివైడర్‌ను దాటి ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ ‘ముఖ్య మంత్రి తీర్థయాత్ర పథకం’ కింద రెండు బస్సుల్లోనూ ప్రమాద సమయంలో 37 మంది యాత్రికులు ఉన్నారు. ఈ పథకం కింద 50 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు తీర్థయాత్రలు చేయడానికి అర్హులు. పంజాబ్ ప్రభుత్వం అర్హులైన యాత్రికులకు ఉచితంగా ఏసీ స్లీపర్ బస్సు ప్రయాణం, వసతి ఆహారాన్ని అందిస్తుంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Punjab CM | రోడ్డు ప్రమాద మృతులకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించిన భగవంత్ మాన్..!
Woman murdered in trial room | బట్టల షాప్‌లోని ట్రయల్ రూమ్‌లో ఉద్యోగిని మృతదేహం.. ఆమెను హత్య చేసిన యువకుడు అరెస్ట్
Mahesh Bigala | దీక్షా దివాస్ వేడుకలకు సిద్ధం కావాలి.. బీఆర్ఎస్ ఎన్నారై శాఖలకు మహేష్ బిగాల పిలుపు
Cancer | భారత్‌లో భారీగా పెరుగుతున్న క్యాన్సర్ కేసులు.. ముందస్తుగా గుర్తించడం అవసరం అంటున్న నిపుణులు..
man kills live-in partner’s dogs | బ్రేకప్ చెప్పిందని.. సహజీవనం చేసిన మహిళ పెంపుడు కుక్కలను చంపిన వ్యక్తి
ట్రెండింగ్ వార్తలు
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!

