Liver Transplant Surgery: లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ.. భార్యాభర్తలు మృతి
Liver Transplant Surgery: కాలేయ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్న భార్యాభర్తలు మృతిచెందారు. భర్తకు లివర్ అవయవాన్ని దానం చేసిన భార్య.. తన భర్త చనిపోయిన కొన్ని రోజులకే ప్రాణాలు విడిచింది. ఈ ఘటన మహారాష్ట్రలోని పుణెలో జరిగింది.
పుణె: మహారాష్ట్రలోని పుణెలో కాలేయ మార్పిడి(Liver Transplant Surgery) చేయించుకున్న భార్యాభర్తలు మృతిచెందారు. భర్తకు లివర్ అవయవాన్ని దానం చేసిన భార్య.. తన భర్త చనిపోయిన కొన్ని రోజులకే ప్రాణాలు విడిచింది. దీంతో మహారాష్ట్ర సర్కారు పుణెలోని ప్రైవేటు ఆస్పత్రులకు నోటీసులు జారీ చేసింది. సహ్యాద్రి ఆస్పత్రిలో కాలేయ మార్పిడి సర్జరీ జరిగింది. ఆ ప్రొసిడజర్కు చెందిన పూర్తి వివరాలను ఇవ్వాలని ఆరోగ్యశాఖ కోరింది. ఆస్పత్రికి నోటీసులు జారీ చేసినట్లు ఆరోగ్యశాఖ డైరెక్టర్ డాక్టర్ నాగనాథ్ యంపల్లి తెలిపారు. గ్రహీత, దాతకు చెందిన వీడియో రికార్డులను సమర్పించాలని ఆదేశించారు.
బాధిత తంపతులను బాబూ కోమ్కార్, అతని భార్య కామినిగా గుర్తించారు. భర్త బాపుకు తన కాలేయాన్ని డోనేట్ చేసింది కామినీ. ఆగస్టు 15వ తేదీన ఆ సర్జరీ జరిగింది. కాలేయ మార్పిడి శస్త్రచికిత్స తర్వాత బాపు కోమ్కార్ ఆరోగ్యం క్షీణించింది. అతను ఆగస్టు 17వ తేదీన చనిపోయాడు. అయితే ఇన్ఫెక్షన్ సోకడం వల్ల ఆగస్టు 21వ తేదీన కామిని మృతిచెందింది.
వైద్యుల నిర్లక్ష్యం వల్ల దంపతులు మృతిచెందినట్లు కుటుంబసభ్యులు ఆరోపించారు. మరణించిన వారి పట్ల దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రోటోకాల్ ప్రకారమే శస్త్రచికిత్స నిర్వహించినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. విచారణకు సహకరిస్తున్నట్లు చెప్పారు. బాధిత పేషెంట్ బాపు కోమ్కార్కు పలు రకాల హైరిస్క్ రుగ్మతలు ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కామిని కోమ్కార్ మృతి గురించి ఆస్పత్రి స్పందిస్తూ.. సర్జరీ తర్వాత ఆమె ప్రారంభంలో బాగానే కోలుకున్నదని, కానీ ఆ తర్వాత ఆమె సెప్టిక్ షాక్కు గురైందని, దీంతో పలు అవయవాలు దెబ్బతిన్నట్లు చెప్పారు.అత్యాధునిక చికిత్స విధానంతో కూడా ఆమెను కాపాడుకోలేకపోయినట్లు చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | ఏపీలో గెలిచిన మేయర్లు, చైర్పర్సన్ల ప్రమాణ స్వీకారం ఎప్పుడంటే ?
Jairam Ramesh | రాముడి పేరుతో పాపాలు ఇంకెన్నాళ్లు..? బీజేపీపై జైరాం రమేష్ ఆగ్రహం
Talasani Srinivas Yadav | ఆర్జేడీ నేత తేజస్విప్రసాద్ యాదవ్, ఎస్పీ నేతలకు తలసాని స్వాగతం.. వీడియో
cop caught in woman’s home | అర్ధరాత్రి వేళ మహిళ ఇంట్లో పోలీస్ అధికారి.. చుట్టుముట్టిన గ్రామస్తులపై కాల్పులు, ఒకరు మృతి
అన్ని వర్గాలను మోసం చేసిన కాంగ్రెస్ : మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

