ర్యాష్ డ్రైవింగ్‌పై నిలదీసినందుకు… పోలీస్ కానిస్టేబుల్‌పై ఐదుగురు దాడి
స్థానికులు వెంటనే స్పందించారు. సివిల్ డ్రెస్‌లో ఉన్న పోలీస్ కానిస్టేబుల్ అశోక్‌పై దాడి చేసిన వారిలో నలుగురిని పట్టుకున్నారు.
చెన్నై: ర్యాష్ డ్రైవింగ్‌పై నిలదీసినందుకు డ్యూటీలో లేని పోలీస్ కానిస్టేబుల్‌పై ఐదుగురు యువకులు దాడి చేశారు. తమిళనాడులోని సేలంలో ఈ సంఘటన జరిగింది. 30 ఏళ్ల అశోక్, అస్తంపట్టి పోలీస్ స్టేషన్లో పోలీస్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. డ్యూటీలో లేని అతడు రాత్రి వేళ బైక్‌పై వెళ్తున్నాడు. అయితే ఒక బైక్‌పై ముగ్గురు వ్యక్తులు ర్యాష్‌గా డ్రైవ్ చేస్తున్నారు. దీంతో అశోక్ తన బైక్‌ను ఆపి దీనిపై వారిని నిలదీశాడు. ఈ నేపథ్యంలో బైక్‌పై ఉన్న ముగ్గురు యువకులు అశోక్‌పై దాడి చేశారు. మరో ఇద్దరు అనుచరులు కూడా అక్కడకు వచ్చి ఆయనను కొట్టారు.
మరోవైపు ఇది చూసిన స్థానికులు వెంటనే స్పందించారు. సివిల్ డ్రెస్‌లో ఉన్న పోలీస్ కానిస్టేబుల్ అశోక్‌పై దాడి చేసిన వారిలో నలుగురిని పట్టుకున్నారు. ఈ విషయం తెలిసి సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులకు వారిని అప్పగించారు. పోలీస్ కానిస్టేబుల్‌పై దాడి చేసిన నిందితులను అబ్దుల్ రెహమాన్, రికాన్‌పాషా, అస్లాం అలీ, రిజ్వాన్‌గా గుర్తించారు.
ఈ సంఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. పారిపోయిన ఐదో వ్యక్తి కోసం వెతుకుతున్నారు. కౌన్సిలర్ సదాజ్ కుమారుడు అబ్దుల్ రెహమాన్ అని పోలీసులు తెలిపారు. కాగా, ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

