న్యూఢిల్లీ: ఇండియన్ నేవీ మాజీ ఉద్యోగి, కమాండర్ అభిలాష్ టోమీ (Abhilash Tomy) ఓ సుదీర్ఘ సాహస యాత్రను విజయవంతంగా ముగించాడు. పడవలో సముద్రాలు దాటుతూ ప్రపంచాన్ని చుట్టివచ్చిన తొలి ఆసియావాసిగా చరిత్ర సృష్టించాడు. 44 ఏళ్ల అభిలాష్ టోమీ సముద్రాల్లో ప్రతికూలతలను అధిగమిస్తూ 236 రోజులపాటు 30 వేల మైళ్ల దూరం పడవలో ప్రయాణించి ఈ గోల్డెన్ గ్లోబ్ రేసులో నెగ్గాడు.
దక్షిణాఫ్రికాకు చెందిన మహిళ కిర్‌స్టెన్ న్యూస్చాఫర్ తర్వాత ఫ్రాన్స్‌లోని లెస్ సాబెల్స్ డి ఒలెన్నో ఓడరేవులోగల ఫినిషింగ్ లైన్‌ను అభిలాష్ టోమీ టచ్ చేశాడు. దాంతో సాహసయాత్రలో కిర్‌స్టెన్ తొలి స్థానంలో, అభిలాస్ రెండో స్థానంలో నిలిచారు. అభిలాష్ 1968 నాటి పాతకాలపు సాంకేతికతతో తయారైన పడవతో తన యాత్రను కొనసాగించాడు. దాంతో యాత్ర పొడుగూత పలుమార్లు ఆయన తన బోటును రిపేర్ చేసుకోవాల్సి వచ్చింది. అయినా అతను రెండో స్థానంలో రేసును పూర్తిచేయడం గమనార్హం.
2022 సెప్టెంబర్‌లో ప్రారంభమైన ఈ సాహసయాత్ర ప్రపంచంలోనే అత్యంత కఠినమైన సాహసయాత్రగా రికార్డుల్లోకి ఎక్కింది. మొత్తం 11 దేశాలకు చెందిన 16 మంది నావికులు ఈ రేసులో పోటీపడ్డారు. రేసు 26 వేల నాటికల్ మైళ్ల దూరం పూర్తి చేసుకునేసరికి పోటీలో కేవలం ముగ్గురు మాత్రమే మిగిలారు. చివరికి అభిలాష్, కిర్‌స్టెన్ మాత్రమే రేసును పూర్తి చేయగలిగారు.
వీరి సాహసోపేత రేసు పూర్తి కావడానికి 236 రోజుల 14 గంటల, 46 నిమిషాల, 34 సెకండ్ల సమయం పట్టింది. 2022 సెప్టెంబర్ 4న మొదలైన యాత్ర 2023 ఏప్రిల్ 29న ముగిసింది. కిర్‌స్టెన్ ఈ గోల్డెన్ గ్లోబ్ రేసులో పాల్గొన్న 16 మంది నావికుల్లో ఏకైక మహిళ. ఆ మహిళే రేసులో విజేతగా నిలిచి చరిత్ర సృష్టించడం గమనార్హం. తోటి నావికులు మునిగిపోతుంటే కాపాడినందుకుగాను కిర్‌స్టెన్‌కు నిర్వాహకులు 23 గంటల డిఫరెన్షియల్ అడ్వాంటేజ్ సమయం కూడా ఇచ్చారు.
టోమీ గతంలో 2018లో కూడా గోల్డెన్ గ్లోబ్ రేసులో పోటీపడ్డాడు. అయితే, ఆ సందర్భంగా అతని పడవ సముద్రపు సుడిగుండంలో చిక్కుకుని విరగిపోయింది. ఈ ప్రమాదంలో అతని వెన్నెముకకు తీవ్ర గాయమైంది. ఐదేళ్లలోనే అతను పూర్తిగా కోలుకుని 2022 రేసులో విజేతగా నిలువడంతో యావత్ భారత దేశం గర్విస్తున్నది.
Congratulations to the Former Indian Navy officer Cmdr. (Retd.) @abhilashtomy on completing the Golden Globe Race 2022 in second place. We are so proud of this achievement and grateful for his safe arrival.#UAE #AbuDhabi #GGR2022 #bayanat #Bayanataroundtheworld pic.twitter.com/3SNR8pOXOZ
— Bayanat.AI (@Bayanatg42) April 29, 2023
Adm R Hari Kumar #CNS and all personnel of #IndianNavy congratulate Cdr Abhilash Tomy, KC, NM (retd) on making #India proud, finishing 2nd in the @ggr2022, the world’s most gruelling ocean sailing race using tools & aids replicating the limitations of the first race in 1968. pic.twitter.com/LH2sqee84c
— SpokespersonNavy (@indiannavy) April 29, 2023