Priyanka Gandhi | నేడు వయనాడ్ ఎంపీగా ప్రియాంకా గాంధీ ప్రమాణం..
కాంగ్రెస్ సీనియర్ నేత ప్రియాంకా గాంధీ (Priyanka Gandhi) వయనాడ్ ఎంపీగా ప్రమాణం చేయనున్నారు. గురువారం ఉదయం సభ ప్రారంభ కాగానే స్పీకర్ ఓం బిర్లా ఆమెతో ప్రమాణం చేయించనున్నారు. దీంతో ఆమె తొలిసారిగా లోక్‌సభలో అడుగుపెట్టనున్నగా, పార్లమెంటులో ముగ్గురు గాంధీలు ఎంపీలుగా దర్శనమివ్వనున్నారు.
న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత ప్రియాంకా గాంధీ (Priyanka Gandhi) వయనాడ్ ఎంపీగా ప్రమాణం చేయనున్నారు. గురువారం ఉదయం సభ ప్రారంభ కాగానే స్పీకర్ ఓం బిర్లా ఆమెతో ప్రమాణం చేయించనున్నారు. దీంతో ఆమె తొలిసారిగా లోక్‌సభలో అడుగుపెట్టనున్నగా, పార్లమెంటులో ముగ్గురు గాంధీలు ఎంపీలుగా దర్శనమివ్వనున్నారు. ప్రస్తుతం సోనియా రాజ్యసభలో ఎంపీగా ఉండగా, రాహుల్, ప్రియాంక లోక్‌సభలో కూర్చోనున్నారు. తాజాగా వెలువడిన లోక్‌సభ ఉప ఎన్నికల్లో వయనాడ్ నుంచి ప్రియాంకా గాంధీ రికార్డు మెజార్టీతో గెలుపొందిన విషయం తెలిసిందే.
సార్వత్రిక ఎన్నికల్లో కేరళలోని వయనాడ్, ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలి నుంచి రాహుల్ గాంధీ విజయం సాధించారు. అయితే వయనాడుకు రాజీనామా చేసిన ఆయన ప్రస్తుతం రాయ్‌బరేలి ఎంపీగా కొనసాగుతున్నారు. దీంతో వయనాడ్‌కు ఉపఎన్నిక అనివార్యమైంది. గత నెల జరిగిన బైపోల్లో ప్రియాంకా బరిలోకి దిగారు. తాజాగా వెలువడిన ఫలితాల్లో ఆమె 4.8 లక్షల ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. 3.64 ఓట్లతో ఉన్న రాహుల్ పేరుతో ఉన అత్యధిక మెజార్టీ రికార్డును ఆమె తుడిచివేశారు. కాగా, నాందేడ్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో గెలుపొందిన కాంగ్రెస్ అభ్యర్థి రవీంద్ర వసంతరావు చవాన్ కూడా గురువారం ప్రమాణం చేయనున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

