న్యూఢిల్లీ, ఏప్రిల్ 26: బీరుబాబుల బిల్లు జేబుకు చిల్లు వేసే రోజులు సమీపిస్తున్నాయి. బార్లీతో సహా ముడి పదార్థాల ఖర్చు తడిసి మోపెడైందని అంటూ బీరు కంపెనీలు త్వరలో బీరు ధరను 10-15% ధర పెంచాలని యోచిస్తున్నాయి. ఏడాదిలోనే బార్లీ ధర 65% పెరిగిందని, ప్యాకేజింగ్, రవాణా ఖర్చులూ పెరిగాయని కంపెనీలు చెప్తున్నాయి.