Pregnant Woman Dies | తప్పుడు ఇంజెక్షన్ వల్ల నిండు గర్భిణీ మృతి.. నకిలీ డాక్టర్లపై కేసు
Pregnant Woman Dies | తప్పుడు ఇంజెక్షన్ కారణంగా నిండు గర్భిణీ మరణించింది. కడుపులోని శిశువు కూడా చనిపోయింది. వైద్య దర్యాప్తులో ఈ విషయం నిర్ధారణ అయ్యింది. ఈ నేపథ్యంలో నకిలీ డాక్టర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు.
లక్నో: తప్పుడు ఇంజెక్షన్ కారణంగా నిండు గర్భిణీ మరణించింది. (Pregnant Woman Dies) కడుపులోని శిశువు కూడా చనిపోయింది. వైద్య దర్యాప్తులో ఈ విషయం నిర్ధారణ అయ్యింది. ఈ నేపథ్యంలో నకిలీ డాక్టర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని భదోహి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. విక్రమ్‌పూర్ ప్రాంతానికి చెందిన 23 ఏళ్ల అంచల్‌కు నెలలు నిండాయి. దీంతో కాన్పు కోసం ప్రైవేట్ హాస్పిటల్లో ఆమెను అడ్మిట్ చేశారు.
కాగా, ఆసుపత్రి డాక్టర్లు వినయ్ కుమార్ పాండే, శివ్ బహదూర్ యాదవ్ ఆపరేషన్ కోసం రూ.50,000 కట్టించుకున్నారు. ప్రసవం కోసం అంచల్‌కు ఒక ఇంజెక్షన్ ఇచ్చారు. అస్వస్థతకు గురైన ఆమెతోపాటు కడుపులోని పిండం కూడా మరణించింది. ఆసుపత్రిలో ఆక్సిజన్ లేదంటూ ఆ ఇద్దరు డాక్టర్లు అక్కడి నుంచి పారిపోయారు.
మరోవైపు తప్పుడు ఇంజెక్షన్ కారణంగా దళిత గర్భిణీ అంచల్ చనిపోయినట్లు ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో భదోహి చీఫ్ మెడికల్ ఆఫీసర్ సంతోష్ కుమార్ దీనిపై దర్యాప్తు జరిపించారు. ఆ ప్రైవేట్ ఆసుపత్రికి ఎలాంటి లైసెన్స్ లేదని, డాక్టర్ల డిగ్రీలు నకిలీ అని గుర్తించారు.
కాగా, తప్పుడు ఇంజెక్షన్ కారణంగానే నిండు గర్భిణీ, ఆమె కడుపులోని పిండం మరణించినట్లు పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో నిర్ధారణ అయ్యింది. దీంతో నకిలీ డాక్టర్లపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న వారిద్దరి కోసం పోలీసులు వెతుకున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
Solar-Powered Cart | వీధి వ్యాపారుల కోసం సౌర శక్తి బండి.. ఆవిష్కరించిన ఐఐటీ ఖరగ్‌పూర్
Leap Hour | లీప్ సెకండ్‌కు స్వస్తి.. మూడు దశాబ్దాల చర్చకు తెర
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

