Renewable Energy | పునరుత్పాదక ఇంధన రంగంలో రూ. 32.5 లక్షల కోట్ల నిధులు : ప్రహ్లాద్ జోషీ
Renewable Energy : గుజరాత్లో జరిగిన పునరుత్పాదక ఇంధన సదస్సులో ఎన్డీయేతర రాష్ట్రాలు సహా పలు రాష్ట్రాలు ఉత్సాహంగా పాలుపంచుకున్నాయని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ పేర్కొన్నారు.
Renewable Energy : గుజరాత్లో జరిగిన పునరుత్పాదక ఇంధన సదస్సులో ఎన్డీయేతర రాష్ట్రాలు సహా పలు రాష్ట్రాలు ఉత్సాహంగా పాలుపంచుకున్నాయని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ పేర్కొన్నారు. 2030 నాటికి ఈ రంగంలో రూ. 32.5 లక్షల కోట్ల నిధులు సమకూర్చేందుకు బ్యాంకులు, ఆర్ధిక సంస్ధలు ముందుకొచ్చాయని వెల్లడించారు. విద్యుత్ రంగాన్ని పునరుత్పాదక ఇంధన రంగంగా మార్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నదని చెప్పారు. ప్రహ్లాద్ జోషీ మంగళవారం గాంధీనగర్‌లో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఈ సదస్సులో నాలుగు దేశాలు హాజరయ్యాయని తెలిపారు.
పునరుత్పాదక ఇంధన రంగంలో ప్రపంచానికి భారత్ మార్గనిర్ధేశకత్వం వహించనుందని అన్నారు. ఈరోజు దాదాపు 208 గిగావాట్ పునరుత్పాదక ఇంధనాన్ని మనం ఉత్పత్తి చేస్తున్నామని మంత్రి వివరించారు. ఎన్నో సవాళ్లను మోదీ ప్రభుత్వం అధిగమిస్తోందని, ఈ దిశగా పునరుత్పాక ఇంధన తయారీని ప్రోత్సహించేందుకు జర్మనీ, డెన్మార్క్‌లు మనతో చేతులు కలపడం సంతోషకరమని అన్నారు.
ఏ రాష్ట్ర ప్రభుత్వంపై ఎలాంటి ఒత్తిళ్లు లేకపోయిన అసోం నుంచి తమిళనాడు వరకూ అన్ని రాష్ట్రాలు పునరుత్పాదక ఇంధనాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాయని మంత్రి వివరించారు. పునరుత్పాదక ఇంధన సదస్సు విజయవంతమైందని, ఈ రంగంలోకి రానున్న కొద్ది సంవత్సరాల్లో భారీ పెట్టుబడులు రానున్నాయని, పెద్దసంఖ్యలో ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయని మంత్రి పేర్కొన్నారు. భవిష్యత్ పునరుత్పాదక ఇంధన రంగానిదేనని ప్రహ్లాద్ జోషీ వెల్లడించారు.
Read More :
Swaminarayan temple: న్యూయార్క్‌లో స్వామినారాయణ్ ఆలయంపై దాడి
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP leaders | మమ్మల్ని అరెస్టు చేసినా ఉద్యమం ఆగదు.. సౌరవ్ దాస్, రాంకా వెల్లడి.. క్రైమ్ బ్రాంచ్ ఎదుట హాజరు
అమెరికాలో భార్యను హత్య చేసిన భారత సంతతి వ్యక్తి.. ఐసీఈ ఏజెంట్లు ఆమెను కిడ్నాప్ చేసినట్లు ఆరోపణ
Rahul Gandhi | రాహుల్ గాంధీ వర్సెస్ ప్రియాంకా గాంధీ.. కాంగ్రెస్‌లో విబేధాలున్నాయంటున్న బీజేపీ
డేగలమడుగులో పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం
‘బీఆర్ఎస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించాలి’
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

