చంద్రయాన్-3 ప్రయోగంలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. ఇస్రో చేపట్టిన ఈ ప్రయోగానికి పరిపూర్ణ విజయాన్ని చేకూరుస్తూ రోవర్ ప్రజ్ఞాన్ ఉపరితలంపై విజయవంతంగా అడుగుపెట్టింది. భారతీయులను ఆనంద డోలికల్లో ముంచుతూ చంద్రుడి గుట్టు విప్పడంలో ముఖ్య పాత్ర పోషించే, పరిశోధనల్లో కీలకంగా వ్యవహరించే ప్రజ్ఞాన్ రోవర్ చంద్రుడి ఉపరితలంపై కాలు మోపింది. సెకనుకు ఒక్కో సెం.మీ వేగంతో ఇది ల్యాండర్ ర్యాంపు ద్వారా వడివడిగా బయటకు వచ్చింది.