G20 Summit | విశ్వ శాంతిని కాంక్షిస్తూ ప్రార్ధనలు : ముగిసిన జీ-20 సదస్సు
ఢిల్లీలో రెండురోజుల పాటు జరిగిన జీ-20 సదస్సు (G20 Summit) ఆదివారం ముగిసింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపధ్యంలో విశ్వ శాంతిని కాంక్షిస్తూ జరిగిన ప్రార్ధనలతో సదస్సు ముగిసినట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు.
న్యూఢిల్లీ : ఢిల్లీలో రెండురోజుల పాటు జరిగిన జీ-20 సదస్సు (G20 Summit) ఆదివారం ముగిసింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపధ్యంలో విశ్వ శాంతిని కాంక్షిస్తూ జరిగిన ప్రార్ధనలతో సదస్సు ముగిసినట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. జీ20 సదస్సు ముగిసినట్టు ప్రకటిస్తున్నాను..వసుధైక కుటుంబానికి రోడ్‌మ్యాప్ దిశగా మనం ముందుకు సాగుతామని ఆకాంక్షిస్తున్నా అని మోదీ తన ముగింపు ఉపన్యాసంలో పేర్కొన్నారు. జీ20 అధ్యక్ష అధికార దండాన్ని బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ లూలా డిసిల్వాకు ప్రధాని మోదీ అందచేశారు. సదస్సులో చర్చించిన అంశాలపై సమీక్షించేందుకు ఈ ఏడాది నవంబర్ మాసాంతంలో వర్చువల్ భేటీ జరగాలని మోదీ ప్రతిపాదించారు.
సదస్సులో ముందుకొచ్చిన సూచనలు, అంశాలపై చర్యలు, పురోగతిని సమీక్షించాల్సిన అవసంర ఉందని వ్యాఖ్యానించారు. 2024లో జీ20 అధ్యక్ష బాధ్యతలు చేపడుతున్న బ్రెజిల్ అధ్యక్షుడిని ప్రధాని మోదీ అభినందించారు. ఇక అంతకుముందు జీ20 (G20) సదస్సు రెండో రోజు ఆదివారం పలు దేశాధినేతలు, ప్రతినిధులు రాజ్‌ఘాట్‌ను సందర్శించి మహాత్మగాంధీకి నివాళులు అర్పించారు. సదస్సు చివరిరోజు జీ20 అధ్యక్ష అధికార దండాన్ని ప్రధాని నరేంద్ర మోదీ బ్రెజిల్ అధ్యక్షుడికి అందచేశారు. మరోవైపు ఆఫ్రికన్ యూనియన్ను శాశ్వత సభ్యుడిగా జీ20 స్వాగతించింది.
భారత్ ఆతిధ్యంలో ఢిల్లీలోని ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ కన్వెక్షన్ సెంటర్లో శనివారం నుంచి జీ20 సమావేశాలు జరుగుతున్నాయి. ఈ ఏడాది సదస్సు థీమ్‌గా ఒక భూమి, ఒక కుటుంబం, ఒకే భవిష్యత్‌ను ప్రతిబింబించే వసుధైక కుటుంబ భావనను ఎంచుకున్నారు. మరోవైపు జీ20 సదస్సుకు హాజరయ్యేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ శుక్రవారం ఢిల్లీ చేరుకుని అదే రోజు ప్రధాని నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరిపిన విషయం తెలిసిందే. ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌లో మహాత్మ గాంధీ సమాధి వద్ద నివాళులు అర్పించిన అనంతరం ఆదివారం ఉదయం ఆయన వియత్నాం వెళ్లారు.
Read More :
G-20 | రాజ్‌ఘాట్‌లో మహాత్మా గాంధీకి నివాళులర్పించిన జీ-20 దేశాల నేతలు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
బోనస్ ప్రకటించినా సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు అందని నగదు
MP Helen Haines: కారుతో అటాక్.. గాయపడ్డ ఆస్ట్రేలియా ఎంపీ
Singireddy Niranjan Reddy | రేవంత్ అసమర్థతో హరిగోస పడుతున్న రైతాంగం : మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Iron Rod Pierces Boy’s Mouth | ఆడుతూ కిందపడిన బాలుడు.. నోటిలోకి చొచ్చుకెళ్లిన ఇనుప కడ్డీ
Nishad Kumar: ఏషియన్ పారా గేమ్స్.. లాంగ్ జంప్‌లో నిషాద్ కుమార్‌కు స్వర్ణం
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

