కజన్: రష్యాలోని కజన్ సిటీలో బ్రిక్స్ సమావేశాలు(Brics Meeting) జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్తో ప్రధాని మోదీ భేటీకానున్నారు. విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రి ఈ ప్రకటన చేశారు. గత కొన్నాళ్లుగా వాస్తవాధీన రేఖ వద్ద ఉన్న ఉద్రిక్తతలకు రెండు దేశాలు ముగింపు పలికాయి. లడాఖలో పెట్రోలింగ్ నిర్వహించే అంశంలో డీల్ కుదిరినట్లు రెండు రోజుల క్రితం ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ అంశంపై ఇరు దేశాధినేతలు బ్రిక్స్ భేటీలో చర్చించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.