PM Modi | మూడో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్ధగా భారత్ : మోదీ
PM Modi : రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం రాజ్యసభలో బదులిచ్చారు.
PM Modi : రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం రాజ్యసభలో బదులిచ్చారు. విపక్షాల నిరసనల మధ్య ప్రధాని తన ప్రసంగం కొనసాగించారు. రాబోయే ఐదేండ్లలో పేదరికంపై పోరాటంలో విజయం సాధిస్తామని చెప్పారు. గత పదేండ్ల అనుభవాలతో తాను ఈ మాట చెబుతున్నానని అన్నారు. ఈ ఐదేండ్లలో మరిన్ని కీలక నిర్ణయాలు ఉంటాయని అన్నారు.
భారత్ మూడో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్ధగా అవతరించే నాటికి ఆ ప్రభావం అన్ని రంగాలపై ఉంటుందని అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా కాంగ్రెస్ తీరు మారలేదని ఎద్దేవా చేశారు. 140 కోట్ల మంది ప్రజలను విపక్షాలు అవమానిస్తున్నాయని వ్యాఖ్యానించారు. రాజ్యాంగం వల్లే తనలాంటి వారు పార్లమెంట్ వరకూ రాగలిగారని పేర్కన్నొరు. కాంగ్రెస్ హయాంలో రూ. 60000 కోట్ల వరకూ రైతుల రుణాలు మాఫీ చేసినా లబ్ధిదారుల జాబితాలో చిన్న, సన్నకారు రైతుల పేర్లు చేర్చలేదని ఆరోపించారు.
సభ నుంచి విపక్షాల వాకౌట్
రాజ్యసభలో ప్రధాని ప్రసంగానికి విపక్షాలు అడుగడుగునా అడ్డుతగిలాయి. విపక్ష నేత మాట్లాడేందుకు అనుమతించకపోవడాన్ని నిరసిస్తూ సభ్యులు గందరగోళం సృష్టించారు. విపక్ష నేత మాట్లాడేందుకు అనుమతించాలని నినాదాలు చేస్తూ ప్రధాని ప్రసంగానికి అడ్డుతగిలారు. పాలక పక్ష తీరును నిరసిస్తూ విపక్ష ఎంపీలు నినాదాలు చేస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు.
విపక్షాలు ఎగువ సభ ఔన్నత్యాన్ని దిగజారుస్తున్నారని ప్రధాని మోదీ మండిపడ్డారు. సభను విపక్షాలు అవమానించడం తగదని, వారి తీరు మారకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. అసత్యాలను ప్రచారం చేసే వారికి నిజాన్ని వినే ధైర్యం లేదని దేశ ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. చర్చల్లో వారు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తుంటే వినే ధైర్యం వారికి లేకపోయిందని ఎద్దేవా చేశారు.
Read More :
Vande Bharat | ఆగస్టు 15 నుంచి వందే భారత్ స్లీపర్ ట్రెయిన్స్ ట్రయల్ రన్..!
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని కేరళం అసెంబ్లీలో తీర్మానం
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
Jantar Mantar | జంతర్ మంతర్ ఇకపై నిరసన వేదిక కాదు.. నిరసనల కోసం మూడు కొత్త ప్రాంతాలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

