Vande Bharat | ఆగస్టు 15 నుంచి వందే భారత్ స్లీపర్ ట్రెయిన్స్ ట్రయల్ రన్..!
Vande Bharat | ప్రయాణికుల సౌలభ్యం కోసం తక్కువ సమయంలో ఎక్కువ దూరం ప్రయాణించేలా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పలు మహానగరాల్లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. వీటికి వచ్చిన ఆదరణతో త్వరలోనే వందే భారత్ స్లీపర్ రైళ్లను అందుబాటులోకి తీసుకురావాలని కేంద్రం నిర్ణయించింది. ఈ రైళ్ల ట్రయల్ రన్ ఆగస్టు 15న ప్రారంభం కానుంది.
Vande Bharat : ప్రయాణికుల సౌలభ్యం కోసం తక్కువ సమయంలో ఎక్కువ దూరం ప్రయాణించేలా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పలు మహానగరాల్లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. వీటికి వచ్చిన ఆదరణతో త్వరలోనే వందే భారత్ స్లీపర్ రైళ్లను అందుబాటులోకి తీసుకురావాలని కేంద్రం నిర్ణయించింది. ఈ రైళ్ల ట్రయల్ రన్ ఆగస్టు 15న ప్రారంభం కానుంది.
తెలంగాణలో సికింద్రాబాద్ నుంచి వైజాగ్, సికింద్రాబాద్ టు తిరుపతి, కాచిగూడ-బెంగళూర్ మూడు వందే భారత్ రైళ్లు నడుస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు వందే భారత్ స్లీపర్ రైళ్లను కూడా కాచిగూడ, సికింద్రాబాద్ స్టేషన్ల నుంచి నడపాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రతిపాదించారు. ఇక కొత్తగా నడుపనున్న వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను అత్యంత రద్దీ రూట్లైన కాచిగూడ-విశాఖ, కాచిగూడ-తిరుపతి, సికింద్రాబాద్-పుణె మార్గాల్లో నడపాలని ఉన్నతాధికారులు కోరుతున్నారు.
కొత్త వందే భారత్ స్లీపర్ రైళ్లు 16 బోగీలతో నడపనున్నారు. ఇవి ఏసీ, నాన్ ఏసీ కోచ్‌లు కావడంతో టికెట్ ధరలు అందరికీ అందుబాటులో ఉంటాయని అధికారులు వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | ‘ఇప్పుడు దేశమంతా జంతర్ మంతర్ అవుతుంది’.. నిరసన వేదిక గుర్తింపు రద్దుపై అభిజీత్ దిప్కే
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని కేరళం అసెంబ్లీలో తీర్మానం
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

