PM Modi | మూడో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్ధగా ఎదగనున్న భారత్ : మోదీ
PM Modi : కేంద్రంలో ఎన్డీయే 3 హయాంలో భారత్ ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్ధగా అవతరిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ఆశాభావం వ్యక్తం చేశారు.
PM Modi : కేంద్రంలో ఎన్డీయే 3 హయాంలో భారత్ ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్ధగా అవతరిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ఆశాభావం వ్యక్తం చేశారు. ఢిల్లీలో జరిగిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పోను ఉద్దేశించి ప్రధాని మాట్లాడుతూ తాము మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదేండ్లలో దేశం ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్ధగా ఎదుగుతుందని అన్నారు.
తమ ప్రభుత్వ చర్యలతో గత పదేండ్లలో దేశంలో దాదాపు 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారని చెప్పారు. 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా పురోగమిస్తుందని ఈ లక్ష్యం దిశగా సాగుతున్నామని అన్నారు. మొబిలిటీ రంగానికి ఇది స్వర్ణయుగమని చెప్పారు. ప్రస్తుతం దేశ ఆర్ధిక వ్యవస్ద వేగంగా ఎదుగుతున్నదని అన్నారు.
స్వయం ఆకాంక్షలు, ఆశలతో దేశంలో నూతన మధ్యతరగతి ఎదిగివస్తోందని పేర్కొన్నారు. మధ్యతరగతి ఆదాయాలు విస్తరిస్తున్నాయని, ఇవన్నీ మొబిలిటీ రంగం నూతన శిఖరాలకు చేరేందుకు ఉపకరిస్తాయని చెప్పారు. 2014కు ముందు భారత్‌లో 12 కోట్ల కార్లు విక్రయిస్తే, 2014 నుంచి 21 కోట్లకు పైగా కార్లు అమ్ముడయ్యాయని వివరించారు.
Read More :
Rahul Gandhi | హిమంత, మిలింద్ లాంటి వాళ్లు కాంగ్రెస్‌ను వీడాలి: రాహుల్ గాంధీ
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

