Heeraben Modi | ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ మోదీ అనారోగ్యానికి గురయ్యారు. ఆమెను హుటాహుటిన అహ్మదాబాద్‌లోని యూఎన్ మెహతా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం హీరాబెన్‌కు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. తల్లి ఆరోగ్య వార్త తెలుసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ అహ్మదాబాద్ వెళ్లే అవకాశముంది. ఈ నేపథ్యంలో గుజరాత్ పోలీసులు అప్రమత్తమయ్యారు. నగరవ్యాప్తంగా ప్రత్యేక భద్రత ఏర్పాట్లు చేశారు.
హీరాబెన్ వయస్సు ప్రస్తుతం 100 ఏండ్లు. ప్రస్తుతం ఆమె గాంధీనగర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ తమ్ముడు పంకజ్‌భాయ్‌తో కలిసి బృందావన్ బంగ్లాస్-2, రైసన్, గాంధీనగర్‌లో నివసిస్తున్నారు.