PM Modi | ఈనెల 18న వారణాసికి మోదీ.. రైతు సదస్సులో పాల్గొనే అవకాశం..!
PM Modi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) వారణాసి (Varanasi) పర్యటన ఖరారైనట్లు తెలుస్తోంది.
PM Modi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) వారణాసి (Varanasi) పర్యటన ఖరారైనట్లు తెలుస్తోంది. ఈనెల 18న తన పార్లమెంటరీ నియోజకవర్గమైన వారణాసిలో మోదీ పర్యటించనున్నట్లు సంబంధిత వర్గాలు మంగళవారం తెలిపాయి. వారణాసిలో జరిగే ‘కిసాన్ సమ్మేళన్ (kisan sammelan)’ (రైతు సదస్సు)లో మోదీ పాల్గొని ప్రసంగించే అవకాశం ఉందని సదరు వర్గాలు వెల్లడించాయి. కాగా, వరుసగా మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం మోదీ.. తన సొంత నియోజకవర్గానికి వెళ్లడం ఇదే తొలిసారి.
మోదీ పర్యటనపై స్థానిక బీజేపీ నేతలు మాట్లాడుతూ.. వారణాసిలోని రోహనియా, సేవాపురి అసెంబ్లీ నియోజకవర్గాల్లో రైతుల సదస్సుకు వేదిక ఉండనున్నట్లు తెలిపారు. సదస్సులో పాల్గొన్న అనంతరం దశాశ్వమేధ ఘాట్ (Dashashwamedh Ghat)లో గంగా హారతిలో మోదీ పాల్గొనే అవకాశం ఉందని తెలిపారు. అందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. మోదీ పర్యటన నేపథ్యంలో వారణాసిలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం.
Also Read..
Badrinath | బద్రినాథ్ ధామ్‌కు పోటెత్తుతున్న భక్తులు.. నెలలోపే 5 లక్షల మంది విజిట్
Vijay Thalapathy | దళపతి విజయ్ మంచి మనసు.. టెన్త్, ఇంటర్ టాపర్స్‌కు సన్మానం
Spacebug: స్పేస్‌స్టేషన్‌లో బ్యాక్టీరియా.. సునీతా విలియమ్స్‌కు ఆరోగ్య కష్టాలు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

