Piyush Goyal | కొలువులు లేక యువత సతమతం : కొత్త ఉద్యోగాలపై గోయల్ గొప్పలు
Piyush Goyal : దేశంలో నిరుద్యోగం తాండవిస్తూ ఉపాధి లేక యువత సతమతమవుతుంటే ఉద్యోగాల కల్పనలో మోదీ సర్కార్ ముందువరసలో నిలిచిందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ విస్తుగొలిపే వ్యాఖ్యలు చేశారు.
Piyush Goyal : దేశంలో నిరుద్యోగం తాండవిస్తూ ఉపాధి లేక యువత సతమతమవుతుంటే ఉద్యోగాల కల్పనలో మోదీ సర్కార్ ముందువరసలో నిలిచిందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ విస్తుగొలిపే వ్యాఖ్యలు చేశారు. నిరుద్యోగిత రేటు రికార్డుస్ధాయిలో ఉంటే వాస్తవాలు అందుకు భిన్నంగా ఉన్నాయంటూ గోయల్ గొప్పలు చెప్పారు.
దేశంలో ఉపాధి కల్పనపై ఆర్బీఐ వెల్లడించిన తాజా నివేదిక మోదీ సర్కార్‌లో పెరిగిన నూతన ఉపాధి అవకాశాలు, నూతన ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చిన తీరును కండ్లకు కడుతున్నదని మంత్రి పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశవ్యాప్తంగా ఉపాధి అవకాశాలు పెరిగాయని చెప్పుకొచ్చారు. 1981-82 తర్వాత తొలిసారిగా గత ఏడాది రెండున్నర రెట్లు అధికంగా ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు.
గత ఏడాది 4.6 కోట్ల మందికి పైగా నూతన ఉద్యోగాలు అందుకున్నారని చెప్పారు. ఇది 6 శాతం అధికమని వెల్లడించారు. 2022-23లో అతితక్కువగా 3.2 శాతం నిరుద్యోగిత రేటు నమోదైందని వివరించారు. మోదీ హయాంలో అత్యధికంగా నూతన ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. 2014-2023 మధ్య 12.5 కోట్ల ఉద్యోగాలు సమకూరాయని, 2004-2014 వరకూ యూపీ హయాంలో కేవలం 2.9 కోట్ల నూతన ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చాయని ఎస్బీఐ వెల్లడించిన నివేదిక ఆధారంగా తెలుస్తోందని పీయూష్ గోయల్ వివరించారు.
Read More :
Raj Tarun | రాజ్‌తరుణ్ కేసులో రోజుకో ట్విస్ట్.. రూ.70 లక్షలు ఇచ్చాం : లావణ్య
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

