భగ్గుమంటున్న పెట్రోల్ ధరలు.. మళ్లీ 90 పైసలు పెంపు
న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా పెట్రోల్ ధరలు భగ్గుమంటున్నాయి. గడిచిన 8 రోజుల్లో ఏడు సార్లు చమురు ధరలు పెరిగాయి. ఇవాళ లీటర్ పెట్రోల్‌పై 90 పైసలు, డీజిల్‌పై 76 పైసలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. తాజా పెంపుతో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 113.61 కాగా, డీజిల్ ధర రూ. 99.83గా ఉంది. విజయవాడలో పెట్రోల్ రూ. 115.37, డీజిల్ రూ. 101.23గా ఉంది.
ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 100.21, డీజిల్ ధర రూ. 91.47, ముంబైలో పెట్రోల్ రూ. 115.04, డీజిల్ రూ. 99.25, చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.94, డీజిల్ ధర రూ. 96, కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ రూ. 109.68, డీజిల్ ధర రూ. 94.62గా ఉంది.
ధరల పెంపు ఉపసంహరించుకోవాలి
ఇంధన ధరల పెంపును ఉపసంహరించుకోవాలని, ఈ అంశంపై ప్రధాని మోదీ పార్లమెంట్లో ప్రకటన చేయాలని ప్రతిపక్షాలు నిన్న డిమాండ్ చేశాయి. ధరల పెరుగుదలకు రష్యా–ఉక్రెయిన్ యుద్ధమే కారణమన్న ప్రభుత్వ వాదనను తోసిపుచ్చాయి. జీరోఅవర్‌లో లోక్‌సభలో కాంగ్రెస్, డీఎంకే, టీఎంసీ ఎంపీలు మాట్లాడుతూ ధరల పెరుగుదలతో సాధారణ ప్రజలు, వేతన జీవుల జేబులు గుల్లవుతున్నాయని విమర్శించారు. ధరల పెరుగుదలపై పార్లమెంట్లో చర్చించాలని, దీనికి ఎప్పుడు పుల్‌స్టాప్ పడుతుందో ప్రధాని సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

