లక్నో, చండీగఢ్: మత సామరస్యానికి పంజాబ్, యూపీలోని ఇద్దరు వ్యక్తులు ఆదర్శంగా నిలిచారు. పంజాబ్లోని సంగ్రూర్ జిల్లా పూనావాల్ గ్రామంలో ముస్లింల నమాజ్ కోసం మసీదు నిర్మాణానికి అశ్విని కుమార్ అనే వ్యక్తి రూ.8 లక్షల విలువైన 6,750 చదరపు అడుగుల భూమిని ఈ నెల 8న అధికారికంగా ఉచితంగా దానమిచ్చారు.
ఇక యూపీలోని సుల్తాన్పూర్ జిల్లా వల్లీపూర్ గ్రామానికి చెందిన సయ్యద్ ఇషాన్ అలీ ఇటీవల 2 వేల చదరపు అడుగుల తన సొంత స్థలాన్ని దుర్గా దేవి గుడి కోసం దానం ఇచ్చారు. ఆయన భూమిలో ఇప్పటికే చిన్నపాటి దేవాలయం ఉంది. ‘మాకు కొంత ఉంచుకొని ఉంచుకొని మిగతా అంతా గుడికి ఇచ్చేశాం. మేం మత సామరస్యంతో బతికేవాళ్లం’ అని ఆయన అన్నారు.