పాట్నా: బీహార్(Bihar)లో రెండవ జాతీయ రహదారిపై ఓ కారు ప్రమాదానికి గురైంది. అయితే ఆ కారులో ఉన్న మద్యం సీసాలను స్థానికులు ఎత్తుకెళ్లారు. ఆ లూటీ ఘటనకు చెందిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.అక్టోబర్ 30వ తేదీన ఈ సంఘటన జరిగింది. బీహార్‌లో 2016 నుంచి మద్య నిషేధం ఉన్న విషయం తెలిసిందే. విదేశీ లిక్కర్ బాటిళ్లతో వెళ్తున్న ఓ కారు రోడ్డుపై మరో వాహనాన్ని ఢీకొట్టింది. అయితే హెల్ప్ చేసేందుకు వచ్చిన స్థానికులు ఆ కారులో మద్యం సీసాలు ఉన్నట్లు గుర్తించారు. ప్రమాదం తర్వాత కారులో ఉన్న వ్యక్తులో పారిపోవడంతో.. ఆ కారులో ఉన్న మద్యం సీసాలను స్థానికులు తీసుకెళ్లారు. కార్టన్లలో ఉన్న లిక్కర్ బాటిళ్లు క్షణంలోనే ఖాళీ అయ్యాయి. కారు ఓనర్‌తో పాటు బాటిళ్లు ఎత్తుకెళ్లిన వారిపై చర్యలు తీసుకోనున్నట్లు ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ కమీషనర్ ప్రేమ్ ప్రకాశ్ తెలిపారు.
#Watch : बिहार के सीवान जिले में कार से शराब की बोतलें लूटने का वीडियो वायरल हो रहा है। बताया जा रहा है कि तेज रफ्तार गाड़ी को ग्रामीणों ने रोका था। ड्राइवर डर के चलते कार छोड़कर भाग गया। फिर लोगों ने कार से शराब लूट ली।#Bihar #liquor #viralvideo pic.twitter.com/rDcD7l9egF
— 🚩Kuldeep Shukla BJP (@Kuldeepshukla27) October 31, 2023