Pema Khandu | వరుసగా మూడోసారి.. అరుణాచల్ ముఖ్యమంత్రిగా పెమా ఖండూ ప్రమాణ స్వీకారం
అరుణాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పెమా ఖండూ (Pema Khandu) వరుసగా మూడోసారి బాధ్యతలు చేపట్టనున్నారు. బుధవారం జరిగిన బీజేపీ శాసనసభా పక్ష సమావేశంలో ఎమ్మెల్యేలు పెమా ఖండూని తమ నేతగా మరోసారి ఎన్నుకున్న విషయం తెలిసిందే.
ఈటానగర్: అరుణాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పెమా ఖండూ (Pema Khandu) వరుసగా మూడోసారి బాధ్యతలు చేపట్టనున్నారు. బుధవారం జరిగిన బీజేపీ శాసనసభా పక్ష సమావేశంలో ఎమ్మెల్యేలు పెమా ఖండూని తమ నేతగా మరోసారి ఎన్నుకున్న విషయం తెలిసిందే. దీంతో గురువారం ఉదయం 11 గంటలకు ఆయన సీఎంగా ప్రమాణం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరుకానున్నారు.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 46 స్థానాల్లో విజయం సాధించింది. నేనషల్ పీపుల్స్ పార్టీ(ఎన్పీఈపీ) ఐదు స్థానాల్లో గెలుపొందింది. ఎన్సీపీ మూడు, పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ (పీపీఏ) రెండు, కాంగ్రెస్ ఒక స్థానంలో, స్వతంత్ర అభ్యర్థులు మూడు స్థానాలను కైవసం చేసుకున్నాయి. మొత్తం 60 స్థానాల్లో ఎన్నికలకు ముందే 10 స్థానాల్లో బీజేపీ ఏకగ్రీవంగా ఎన్నికైంది. వారిలో సీఎం పెమా ఖండూ, ఉప ముఖ్యమంత్రి చౌనా మెయిన్ కూడా ఉన్నారు.
44 ఏండ్ల పెమా ఖండూ 2011లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో తన తండ్రి, మాజీ సీఎం దోర్జీ ఖండ్ మరణంతో రాజకీయాల్లో ప్రవేశించారు. తన తండ్రి స్థానం నుంచి పోటీచేసిన ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2016లో అప్పటి ముఖ్యమంత్రి నబం టుకీపై తిరుగుబాటు చేసిన తన వర్గం ఎమ్మెల్యేలతో బీజేపీలో చేరారు. దీంతో మెజార్టీ కోల్పోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయింది. అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఖండూ బాధ్యతలు చేపట్టారు. 2019లో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన ఆయన మళ్లీ సీఎం పీఠాన్ని కైవసం చేసుకున్నారు. ఇప్పుడు మరోసారి అరుణాచల్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

