IndiGo | మద్యం మత్తులో విమాన సిబ్బంది పట్ల అనుచిత ప్రవర్తన.. వ్యక్తి అరెస్ట్
IndiGo | ఇండిగో (IndiGo) విమానంలో ఓ 32 ఏళ్ల ప్రయాణికుడు (Passenger ) మద్యం మత్తులో వీరంగం సృష్టించాడు. క్రూ సిబ్బంది పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. సిబ్బంది ఆ ప్రయాణికుడిని పలు మార్లు హెచ్చరించినప్పటికీ అతడి ప్రవర్తనలో ఎలాంటి మార్పూ రాలేదు.
IndiGo | విమాన ప్రయాణంలో (Air travel) ప్రయాణికుల అనుచిత ప్రవర్తన శ్రుతి మించుతోంది. కొందరు ప్రయాణికులు మద్యం మత్తులో తోటి ప్రయాణికులను దుర్భాషలాడటం, మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తూ లైంగిక దాడులకు పాల్పడటం వంటి ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటికే ఇలాంటి ఘటనలు అనేకం వెలుగులోకి వచ్చాయి. తాజాగా ఇండిగో (IndiGo) ఫ్లైట్‌లో అలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది.
ఇండిగో 6E 556 విమానం నవంబర్ 17న జైపూర్ నుంచి బెంగళూరు బయలుదేరింది. ఆ విమానంలో ఓ 32 ఏళ్ల ప్రయాణికుడు (Passenger ) మద్యం మత్తులో వీరంగం సృష్టించాడు. క్రూ సిబ్బంది (IndiGo Crew) పట్ల అనుచితంగా ప్రవర్తించాడు (Misbehaves). సిబ్బంది ఆ ప్రయాణికుడిని పలు మార్లు హెచ్చరించినప్పటికీ అతడి ప్రవర్తనలో ఎలాంటి మార్పూ రాలేదు. దీంతో విమాన సిబ్బంది ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఇక విమానం బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్‌కాగానే సదరు ప్రయాణికుడ్ని పోలీసులకు అప్పగించారు.
‘ఇండిగో నుంచి అందిన ఫిర్యాదు మేరకు సదరు ప్రయాణికుడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నాం. ఆ తర్వాత అతడు బెయిల్‌పై విడుదలయ్యాడు’ అని పోలీసు సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. మరోవైపు ఈ ఘటనపై ఇండిగో స్పందించింది. సదరు వ్యక్తి ప్రవర్తనతో ఇతర ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు ఎయిర్‌లైన్స్ తెలిపింది.
Also Read..
BMW Crashes | బీఎమ్‌డబ్ల్యూ కారు బీభత్సం.. నలుగురికి గాయాలు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

