జౌన్‌పుర్: ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పుర్ జిల్లాలో సుహల్దేవ్ స్వాభిమాన్ పార్టీ నేతపై కార్యకర్త వెరైటీ రీతిలో విరుచుకుపడ్డాడు. తొలుత ఆ నేత గురించి గొప్పగా మాట్లాడి, ఆ తర్వాత అతని మెడలో దండ వేసి, ఆ తర్వాత అతని చెంపై తీవ్ర స్థాయిలో కొ్ట్టాడు. ఈ ఘటనకు చెందిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతున్నది.
వివరాల్లోకి వెళ్తే.. ఆషాపూర్ గ్రామంలో మహారాజ్ సుహల్దేవ్ విక్టరీ డే నిర్వహించారు. ఎస్ఎస్పీ జాతీయ అధ్యక్షుడు మహేంద్ర రాజ్‌భర్‌ను ఆ కార్యక్రమానికి ఆహ్వానించారు. జఫ్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో రాజ్‌భర్ వర్గ ప్రజలు అధిక సంఖ్యలో ఉంటారు. అక్కడ రాజ్‌భర్ విగ్రహాన్ని స్థాపించేందుకు భూమి పూజ నిర్వహించారు. దాని కోసం మహేంద్రను చీఫ్ గెస్ట్‌గా ఆహ్వానించారు.
అయితే పార్టీ కార్యకర్త బ్రిజేశ్ రాజ్‌భర్.. ఆ కార్యక్రమంలో తొలుత మహేంద్ర మెడలో పూలమాల వేశారు. ఆ వెంటనే అతను మహేంద్రపై దాడి చేశాడు. చెంప చెల్లుమనిపించాడు. తీవ్ర స్థాయిలో పంచ్‌లు విసిరాడు. జనం చూస్తుండగానే ఈ ఘటన జరిగింది.
ఈ ఘటన పట్ల మహేంద్ర రాజ్‌భర్ స్పందించారు. యూపీ మంత్రి ఓం ప్రకాశ్ రాజ్‌భర్.. తనపై దాడి చేయించినట్లు ఆరోపించారు. కానీ ఈ ఘటనపై ఇప్పటి వరకు యూపీ మంత్రి స్పందన ఇవ్వలేదు. దాడి ఘటన తర్వాత జలాల్పుర్ పోలీసు స్టేషన్లో మహేంద్ర ఫిర్యాదు చేశారు.
UP neta welcomed through speech, garlanded and then slapped!
Mahendra Rajbhar, former leader of OP Rajbhar-led Suheldev Bhartiya Samaj party was caught off-guard when he was invited to an event in UP’s Jaunpur, humiliated on the stage in a proper speech, garlanded and then… pic.twitter.com/u5EKjJsmbl
— Piyush Rai (@Benarasiyaa) June 10, 2025