Partha Chatterjee | టీచర్ల నియామక కుంభకోణంలో అరెస్టయిన పార్థా చటర్జీని మంత్రి పదవి నుంచి తొలగించినట్లు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం గురువారం ప్రకటించింది. తక్షణం ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని తెలిపింది. పార్థా చటర్జీని మంత్రి పదవి నుంచి తొలగించే విషయమై రాష్ట్ర క్యాబినెట్లో ఎటువంటి చర్చ జరుగలేదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
టీచర్ల కుంభకోణంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు పార్థాచటర్జీని ఇటీవల అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కుంభకోణంలో అరెస్టయిన పార్థా చటర్జీని పార్టీ నుంచి బహిష్కరించాలని తృణమూల్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కునాల్ ఘోష్ అన్నారు.
పార్థా చటర్జీ.. పశ్చిమ బెంగాల్ సీఎం-తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుల్లో ఒకరు. అయితే, ఆయనను దర్యాప్తు సంస్థ అధికారులు అరెస్ట్ చేయడానికి ముందు పలు దఫాలు పార్థా చటర్జీ చేసిన ఫోన్ కాల్స్‌ను సీఎం మమతా బెనర్జీ రిసీవ్ చేసుకోలేదని వార్తలొచ్చాయి.