Chandrayaan-3 | బెంగళూరు, నవంబర్ 15: చంద్రయాన్-3 స్పేస్ క్రాఫ్ట్ను నింగిలోకి తీసుకెళ్లిన ఎల్వీఎం-3 ఎం4 రాకెట్ విడిభాగం(క్రయోజనిక్ అప్పర్ స్టేజ్) ఒకటి నియంత్రణ కోల్పోయి తిరిగి భూ వాతావరణంలోకి ప్రవేశించింది. బుధవారం మధ్యాహ్నం 2.24 గంటల సమయంలో ఇది భూ వాతావరణంలోకి వచ్చినట్టు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) వెల్లడించింది.
ఈ ఏడాది జూలైలో చంద్రయాన్ 3ని ప్రయోగించిన విషయం తెలిసిందే. లాంచింగ్ చేసిన 124 రోజుల తర్వాత రాకెట్ విడిభాగం భూ వాతావరణంలోకి ప్రవేశించిందని ఇస్రో తెలిపింది.