రేపటి నుంచి పార్లమెంట్
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 12 వరకు జరుగనున్న ఈ సమావేశాల్లో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ నెల 23న 2024-25 ఆర్థిక సంవత్సర పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెడుతారు.
- నేడు అఖిలపక్ష భేటీ
- 23న కేంద్ర బడ్జెట్
న్యూఢిల్లీ, జూలై 20: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 12 వరకు జరుగనున్న ఈ సమావేశాల్లో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ నెల 23న 2024-25 ఆర్థిక సంవత్సర పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెడుతారు. ముందు రోజు సోమవారం నాడు ఆమె ఆర్థిక సర్వేను పార్లమెంట్ ముందుకు తీసుకొస్తారు.
90 ఏండ్ల నాటి ఎయిర్‌క్రాఫ్ట్ చట్టం స్థానంలో భారతీయ వాయుయాన్ విధేయక్-2024 బిల్లుతో సహా మొత్తం ఆరు బిల్లులను ప్రవేశపెట్టాలనే యోచనలో కేంద్రం ఉన్నట్టు తెలుస్తున్నది. పార్లమెంట్ సమావేశాల్లో నీట్ లీకేజీ వ్యవహారం, రైల్వే భద్రత తదితర అంశాలపై ఎన్డీయే ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు విపక్షాలు సిద్ధమయ్యాయి. పార్లమెంట్ సమావేశాల ప్రారంభం నేపథ్యంలో ఆదివారం అఖిలపక్ష సమావేశం జరుగనున్నది.
వందేమాతరం, జై హింద్ నినాదాలు చేయొద్దు!
పార్లమెంట్ సమావేశాల ప్రారంభం నేపథ్యంలో ‘హ్యాండ్‌బుక్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ రాజ్యసభ’లోని పలు సారాంశాలను ప్రస్తావిస్తూ రాజ్యసభ సెక్రటేరియట్ తాజాగా ఒక బులెటిన్ విడుదల చేసింది. సభాపతి రూలింగ్స్‌ను సభలో కానీ, సభ బయట కానీ ఎంపీలు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా విమర్శించకూడదని పేర్కొన్నది. అదేవిధంగా వందే మాతరం, జై హింద్ సహా ఏ ఇతర నినాదాలు చేయకూదని గుర్తుచేసింది. సభలో ప్లకార్డులు ప్రదర్శించకూడదని స్పష్టం చేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

