న్యూఢిల్లీ: ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా, బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా ప్రేమలో ఉన్నారని, గత కొన్ని రోజులుగా డేటింగ్ చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో ఇటీవల విపరీతంగా వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. వీరిద్దరికి నిశ్చితార్థం కూడా అయిందని తాజాగా మరో వార్త వైరల్ అవుతున్నది. దీనికి సంబంధించి మరో ఆప్ ఎంపీ సంజీవ్ అరోరా మంగళవారం చేసిన ట్వీట్.. రాఘవ్ చద్దా, పరిణీతి మధ్య బంధాన్ని నిర్ధారించేలా ఉన్నది. రాఘవ్, పరిణీతిలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. వారిద్దరి బంధం ప్రేమ, ఆనందంతో నిండిపోవాలి’ అని ఓ ట్వీట్ చేశారు. అయితే తమ బంధంపై రాఘవ్ చద్దా, పరిణీతి చోప్రాలు ఇప్పటి వరకు అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు.