Pani Puri | గూగుల్ డూడుల్.. పానీపూరీ గేమ్ అదుర్స్..!
Pani Puri | పానీ పూరీ (Pani Puri).. ఈ పేరు తెలియని వారు ఉండరు. ఇది మన దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన స్ట్రీట్ ఫుడ్ (Street Food). అన్ని వయస్సుల వారు ఇష్టపడే ఈ పానీపూరికి ప్రముఖ సెర్జ్ ఇంజిన్ గూగుల్ (Google) అరుదైన గౌరవం ఇచ్చింది.
Pani Puri | పానీ పూరీ (Pani Puri).. ఈ పేరు తెలియని వారు ఉండరు. ఇది మన దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన స్ట్రీట్ ఫుడ్ (Street Food). రోడ్డు పక్కన పానీపూరీ బండి కనిపిస్తే చాలు పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు తినకుండా మాత్రం వెనక్కిరారు. కరకరలాడే చిన్నచిన్న పూరీల్లో ఆలూ స్టఫ్ పెట్టి.. ప్రత్యేకంగా తయారు చేసిన పానీలో ముంచి తింటుంటే ఆ మజానే వేరు. అన్ని వయస్సుల వారు ఇష్టపడే ఈ పానీపూరికి ప్రముఖ సెర్జ్ ఇంజిన్ గూగుల్ (Google) అరుదైన గౌరవం ఇచ్చింది.
పానీపూరీపై ప్రపంచ రికార్డు నెలకొల్పి 8 ఏళ్లు అవుతున్న సందర్భంగా గూగుల్ ప్రత్యేక డూడుల్ (Doodle)ను రూపొందించింది. పానీపూరీ ఆకృతులతో ఓ గేమ్ ను పరిచయం చేసింది. ప్రస్తుతం ఇది నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
2015లో జులై 12న మధ్యప్రదేశ్ ఇండోర్ (Indore)లోని ఒక రెస్టారెంట్ 51 రకాల నోరూరించే పానీ పూరీలు తయారు చేసి ప్రపంచ రికార్డు సృష్టించింది. ఆ రికార్డును గుర్తు చేస్తూ గూగుల్ నేడు ప్రత్యేక పానీపూరీ డూడుల్ ను రూపొందించింది.
With India's first ever F-oodle (i.e- a #GoogleDoodle honouring food) we're celebrating our favourite snack
On this day, Masterchef Neha set a world record by creating the most flavours of pani puri. So here's a little game where you can break records & set high scores 🏆
🔗… pic.twitter.com/n8yqrNkpXF— Google India (@GoogleIndia) July 11, 2023
Also Read..
Kashmira Shah | సల్మాన్ సలహాతోనే తల్లినయ్యా : బాలీవుడ్ నటి
Rahul Gandhi | త్వరలో కొత్తింటికి మారబోతున్న రాహుల్..!
Heavy Rains | ఉత్తరాదిలో వరుణుడి బీభత్సం.. 100 మందికిపైగా మృతి
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

