న్యూఢిల్లీ, నవంబర్ 21: పాన్ కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానం చేసేందుకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు చివరి అవకాశాన్ని కల్పిస్తున్నది. మార్చి 31లోగా వెయ్యి రూపాయల జరిమానా చెల్లించి ఇప్పటికైనా తమ పాన్ కార్డును ఆధార్‌తో లింకు చేసుకోవచ్చని తెలిపింది. లేదా మార్చి నెల తరువాత పాన్ కార్డును రద్దు చేస్తామని ప్రకటించింది. పాన్ కార్డును ఆధార్‌తో అనుసంధానం చేసేందుకు ఆదాయపు పన్ను విభాగం పలుమార్లు గడువు పొడిగిస్తూ అవకాశం కల్పించింది. చివరిసారిగా ఈ ఏడాది మార్చి 31 వరకు అవకాశం కల్పించింది.