ప్రజా భద్రతలో భారత్‌కంటే పాకిస్థానే ఉత్తమ స్థానంలో నిలిచింది. ప్రజల ప్రాణ, ఆస్తి రక్షణలో పోలీసుల పనితనం ఎన్నో చిన్నదేశాలకంటే మనదేశంలో అధ్వాన్నంగా ఉన్నదని గాలప్ లా అండ్ ఆర్డర్ ఇండెక్స్-2021లో తేలింది. 121 దేశాల్లో ఈ సర్వే నిర్వహించగా, మనదేశం 80 పాయింట్లతో 60వ స్థానంలో నిలిచింది. పాకిస్థాన్ 82 పాయింట్లలతో 48వ స్థానంలో నిలువటం విశేషం.
భారత్ ర్యాంకు-60 .. పాక్ ర్యాంకు-48
1. మీరు నివసిస్తున్న ప్రాంతంలో పోలీసుల పనితీరుపై మీకు నమ్మకం ఉన్నదా?
2. మీరు నివసిస్తున్న ప్రాంతంలో మీరు ఒంటరిగా అర్థరాత్రి వీధుల్లో నడిచి వెళ్లగలనని భావిస్తున్నారా?
3. గత 12 నెలల్లో మీదిగానీ, మీ పక్కింటివాళ్లదిగానీ డబ్బు లేదా ఆస్తులు చోరీకి గురయ్యాయా?
4. గత 12 నెలల్లో ఎప్పుడైనా మీపై దాడి జరిగిందా?