న్యూఢిల్లీ: అమర్నాథ్ యాత్రలో విధ్వంసం సృష్టించేందుకు పాకిస్థాన్‌కు చెందిన ఐఎస్ఐ కుట్ర పన్నినట్టు నిఘా వర్గాలకు సమాచారం అందింది. ఐఎస్ఐ ఖలిస్థానీ ఉగ్ర సంస్థ బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్‌తో కలిసి అమర్నాథ్ యాత్రపై కుట్రకు ప్లాన్ చేసిందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
భక్తులను లక్ష్యంగా చేసుకొని అమర్నాథ్ యాత్రలో విధ్వంసం చేసేందుకు ఐఎస్ఐ కుట్రలు చేస్తున్నదని, పెద్దయెత్తున దాడులు చేసేందుకు పంజాబ్‌లోని గ్యాంగ్స్టర్లు, తీవ్రవాద గ్రూపులు, ఉగ్ర సంస్థల సహకారం తీసుకొన్నట్టు తెలిసింది.