Chidambaram | కేంద్రం కనుసన్నల్లోనే విపక్ష నేతల ఫోన్ల హ్యాకింగ్ : చిదంబరం
దేశవ్యాప్తంగా ఫోన్ల హ్యాకింగ్ (Phone Hacking) వ్యవహారం మళ్లీ దుమారం రేపుతోంది. తమ ఐఫోన్లను హ్యాక్ చేస్తున్నారంటూ పలువురు విపక్ష ఎంపీలు ఆరోపిస్తున్నారు.
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా ఫోన్ల హ్యాకింగ్ (Phone Hacking) వ్యవహారం మళ్లీ దుమారం రేపుతోంది. తమ ఐఫోన్లను హ్యాక్ చేస్తున్నారంటూ పలువురు విపక్ష ఎంపీలు ఆరోపిస్తున్నారు. పలువురు ప్రతిపక్ష ఎంపీలు, నేతల ఐఫోన్లకు యాపిల్ నుంచి ఒకేసారి ‘హ్యాకింగ్ అలర్ట్’ సందేశాలు రావడం సంచలనంగా మారింది. ఈ అంశంపై విపక్షాలు కేంద్రంలోని బీజేపీ సర్కార్ లక్ష్యంగా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి.
వందలాది విపక్ష నేతలకు యాపిల్ నుంచి హ్యాకింగ్ అలర్ట్ మెసేజ్‌లు రావడం కేంద్రం కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతోందనే అనుమానాలు రేకెత్తిస్తోందని కాంగ్రెస్ నేత, మాజీ కేంద్ర మంత్రి పీ చిదంబరం (Chidambaram) అన్నారు. విపక్ష నేతలకే ఇలా ఎందుకు జరుగుతోంది..? విపక్ష నేతల ఫోన్లను హ్యాక్ చేయడానికి ఎవరికి ఆసక్తి ఉంటుందని ట్విట్టర్ వేదికగా చిదంబరం ప్రశ్నించారు. పెగాసస్ వ్యవహారం తర్వాత ఇప్పుడు అందరి అనుమానం ప్రభుత్వ ఏజెన్సీ వైపే ఉందని, ఇప్పటి వరకూ ఇది కేవలం అనుమానం మాత్రమేనని అన్నారు.
ఇక నియమాలను బాహాటంగా విస్మరిస్తున్నారని, విపక్ష నేతల ఫోన్ హ్యాకింగ్‌కు కేంద్ర ఏజెన్సీలదే బాధ్యతని కాంగ్రెస్ నేత టీఎస్ సింగ్‌దేవ్ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తోందని, రాజ్యాంగ ఉల్లంఘన అంటే మీరు నియంతృత్వ పోకడలతో వ్యవహరిస్తున్నారని ఆయన కాషాయ పాలకులను దుయ్యబట్టారు.
Read More :
Jio World Plaza | జియో వరల్డ్ ప్లాజా ప్రారంభం.. అంబానీ పార్టీలో సందడి చేసిన తారలు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

