dengue cases | కర్ణాటకలో పది వేలకు చేరిన డెంగ్యూ కేసులు.. ఏడు మరణాలు
dengue cases | కర్ణాటకలో డెంగ్యూ వ్యాధి మరింతగా వ్యాపిస్తోంది. కేసుల సంఖ్య పది వేలకు చేరుతోంది. ఈ ఏడాది జనవరి నుంచి జులై వరకు 9,000కుపైగా డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. ఈ వ్యాధి బారిన పడి ఇప్పటి వరకు ఏడుగురు మరణించారు.
బెంగళూరు: కర్ణాటకలో డెంగ్యూ వ్యాధి (dengue cases) మరింతగా వ్యాపిస్తోంది. కేసుల సంఖ్య పది వేలకు చేరుతోంది. ఈ ఏడాది జనవరి నుంచి జులై వరకు 9,000కుపైగా డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. ఈ వ్యాధి బారిన పడి ఇప్పటి వరకు ఏడుగురు మరణించారు. జులై 13 వరకు 66,298 మందికి డెంగ్యూ పరీక్షలు నిర్వహించారు. మొత్తం 9,082 మందికి పాజిటివ్‌గా తేలింది. గత 24 గంటల్లో 2,557 మందిని పరీక్షించగా, 424 మందికి డెంగ్యూ పాజిటివ్‌గా నమోదైంది. జ్వరం వల్ల 353 మంది ఆసుపత్రిలో చేరారని, వారిలో 119 మంది గత 24 గంటల్లో ఆసుపత్రి పాలయ్యారని వైద్యాధికారులు తెలిపారు.
కాగా, జనవరి నుంచి జులై 13 వరకు రాజధాని బెంగళూరు ప్రాంతాల్లో 2,830 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా 110 మంది ఆసుపత్రి పాలయ్యారు. గత 24 గంటల్లో కొత్తగా 202 డెంగ్యూ కేసులు నమోదు కావడంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు.
మరోవైపు చిక్కమగళూరులో జులై 13 వరకు 599 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో అత్యధికంగా నమోదైన కేసుల్లో రెండో స్థానంలో ఈ నగరం ఉంది. 5,725 మంది పెద్దలకు డెంగ్యూ పరీక్ష నిర్వహించగా 18 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అలాగే సంవత్సరం నుంచి 18 ఏళ్ల లోపు వయస్సున్న 3,203 మంది పిల్లలు, ఏడాది లోపు వయస్సున్న 154 మంది శిశువులకు కూడా డెంగ్యూ పరీక్షలు నిర్వహించినట్లు వైద్యాధికారులు వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parliament: ప్రోరోగ్ కాకుండా 88 రోజులుగా వర్షాకాల సమావేశాలు.. పార్లమెంట్లో కొత్త రికార్డు
OTT Movies | ఓటీటీలో ఈ వారం 14 కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు.. రణబాలి నుంచి జైలర్ 2 వరకు..!
TV Anchor: పాకిస్థాన్‌లో టీవీ యాంకర్ కాల్చివేత.. భర్త అరెస్టు
Bodybuilder Venkatesan: హైదరాబాదీ బాడీబిల్డర్ వెంకటేశన్‌కు మిస్టర్ నేచురల్ వరల్డ్ టైటిల్
Ranabaali | నెట్‌ఫ్లిక్స్‌లోకి విజయ్ దేవరకొండ, రష్మిక ‘రణబాలి’.. ఐదు భాషల్లో ఓటీటీ స్ట్రీమింగ్, రిలీజ్ డేట్ ఫిక్స్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

