Gold Seized | బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో 9 కిలోల బంగారం పట్టివేత
Gold Seized | కర్ణాటక రాజధాని బెంగళూరు ఎయిర్పోర్ట్ (Bengaluru Airport)లో భారీగా బంగారం పట్టుబడింది (Gold Seized).
Gold Seized | కర్ణాటక రాజధాని బెంగళూరు ఎయిర్పోర్ట్ (Bengaluru Airport)లో భారీగా బంగారం పట్టుబడింది (Gold Seized). రెండు వేర్వేరు ఘటనల్లో దాదాపు రూ.6.29 కోట్ల విలువైన 9 కిలోల బంగారాన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (Department of Revenue Intelligence) అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
డీఆర్ఐ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ బంగారాన్ని మంగళవారం సీజ్ చేశారు. ముందుగా ఓ సిండికేట్ థాయ్ ఎయిర్వేస్ విమానంలో బంగారాన్ని దాచినట్లు డీఆర్ఐ అధికారులకు ముందుగా సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు ఆ విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఫలితంగా 6.834 కిలోల బంగారాన్ని గుర్తించారు. విమానంలో వదిలేసిన హ్యాండ్ బ్యాగ్‌లో ఈ బంగారాన్ని గుర్తించారు. బ్యాగ్‌లోని పత్రాల ఆధారంగా ప్రయాణికులను గుర్తించి అదుపులోకి తీసుకుని విచారించగా.. విమానంలో బంగారాన్ని దాచినట్లు వారు అంగీకరించారు. ఈ బంగారం విలువ రూ.4.77 కోట్లుగా అంచనా వేస్తున్నారు.
ఆ తర్వాత కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో దుబాయ్ నుంచి వచ్చిన ఎమిరేట్స్ విమానంలో 2.18 కిలోల బంగారాన్ని డీఆర్ఐ అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. విమానం ముందు భాగంలోని లావేటరీలో నిషిద్ధ వస్తువుల్లో ఈ బంగారాన్ని దాచినట్లు గుర్తించారు. ఈ బంగారం విలువ రూ.1.52 కోట్లని అంచనా. ఈ మేరకు నిందితుల్ని అదుపులోకి తీసుకుని తదుపరి విచారణ చేపడుతున్నట్లు డీఆర్ఐ అధికారి ఒకరు గురువారం తెలిపారు.
Also Read..
Sunita Williams: స్పేస్ స్టేషన్లో సునితా విలియమ్స్ డ్యాన్స్.. వీడియో
Ayodhya | అయోధ్యలో బీజేపీ ఎందుకు ఓడింది?
ADR | ఎంపీల్లో 93% మంది కోటీశ్వరులే: ఏడీఆర్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

