Government Jobs: 9.79 లక్షల ఉద్యోగాలు ఖాళీ.. రైల్వేశాఖలో 2.93 లక్షలు : కేంద్ర మంత్రి
Government Jobs: దేశవ్యాప్తంగా ప్రభుత్వ శాఖల్లో 9.79 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. రైల్వేశాఖలో 2.93 లక్షలు ఉన్నట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. పార్లమెంట్‌కు రాసి ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఆయన ఈ విషయాన్ని తెలిపారు.
న్యూఢిల్లీ:వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖల్లో సుమారు 9.78 లక్షల ఉద్యోగాలు(government jobs) ఖాళీగా ఉన్నట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్(Jitendra Singh) తెలిపారు. దీంట్లో కేవలం రైల్వేశాఖ(Railways)లోనే సుమారు 2.93 లక్షల ఉద్యోగాలు ఉన్నట్లు చెప్పారు. పార్లమెంట్‌కు రాసి ఇచ్చిన లిఖితపూర్వక లేఖలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. వివిధ శాఖల్లో ఖాళీలు ఏర్పడడం, ఖాళీలను పూర్తి చేయడం నిరంతర ప్రక్రియ అన్నారు. కేంద్ర మంత్రిత్వశాఖలు, సంస్థల్లో రిక్రూట్మెంట్ జరుగుతోందన్నారు. ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని ఇప్పటికే అన్ని శాఖలు ఆదేశాలు ఇచ్చినట్లు మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. ఉద్యోగ కల్పనలో ప్రభుత్వం నిర్వహించే రోజ్‌గార్ మేళాలు కీలకం కానున్నట్లు చెప్పారు. డిఫెన్స్ రంగంలో 2.64 లక్షల ఉద్యోగాలు, కేంద్ర హోంశాఖలో 1.43 లక్షలు, రెవన్యూలో 80,243, ఆడిట్ అండ్ అకౌంట్స్ శాఖలో 25,934 పోస్టులు, అటామిక్ ఎనర్జీ శాఖలో 9460 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు మంత్రి వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

