Opposition | బిల్కీస్ బానో, మణిపూర్ మహిళలు, మహిళా రెజ్లర్లకు కాషాయ నేతలు రాఖీ కట్టాలి : ఉద్ధవ్ ఠాక్రే
విపక్ష (Opposition) కూటమి ఇండియా ముంబై భేటీకి ముందు కాషాయ పార్టీ లక్ష్యంగా శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే విమర్శలు గుప్పించారు.
ముంబై : విపక్ష (Opposition) కూటమి ఇండియా ముంబై భేటీకి ముందు కాషాయ పార్టీ లక్ష్యంగా శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే విమర్శలు గుప్పించారు. ఈరోజు రక్షాబంధన్..బిల్కీస్ బానో, మణిపూర్ మహిళలు, మహిళా రెజ్లర్లకు బీజేపీ రాఖీలు కట్టాలని ఠాక్రే అన్నారు. వీరంతా దేశంలో సురక్షితంగా ఉన్నామన్న భావనలో ఉండేందుకు మనమంతా ముందుకు రావాలని అన్నారు. మరోవైపు గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధరను కేంద్రం రూ. 200 తగ్గించడం తమ ఘనతా ప్రతిపక్ష కూటమి చాటుకుంది.
ఇండియా భేటీ కారణంగానే ఎల్పీజీ సిలిండర్ ధరలను కేంద్రం తగ్గించిందని శివసేన ఠాక్రే గ్రూప్ నేత సంజయ్ రౌత్ పేర్కొన్నారు. ఇక ముంబైలో విపక్ష ఇండియా కూటమి మూడో భేటీలో కీలక నిర్ణయాలు వెలువడతాయని భావిస్తున్నారు. కనీస ఉమ్మడి కార్యక్రమం, సీట్ల సర్ధుబాటుపైనా చర్చలు జరగనున్నాయి. గురు, శుక్రవారాల్లో రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశాలకు 28 విపక్ష పార్టీలు హాజరవుతున్నాయి.
ఈ భేటీలో కనీస ఉమ్మడి కార్యక్రమంపైనా తాము చర్చలు జరుపుతామని సీనియర్ నేత శరద్ పవార్ వెల్లడించారు. సీట్ల సర్దుబాటుపైనా ఈ సమావేశంలో చర్చిస్తామని, దీనిపై రాష్ట్రాల నేతల అభిప్రాయాలు తీసుకుంటామని చెప్పారు. 11 మంది సభ్యులతో కూడిన సమన్వయ కమిటీని కూడా నియమించే అవకాశం ఉందని అన్నారు. ఇండియా కూటమి లోగోనూ ఈ సమావేశాల్లో ఖరారు చేయనున్నారు. కాగా, తాము ఇండియా సహా పాలక ఎన్డీయే వంటి ఏ కూటమిలోనూ చేరబోమని రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని బీఎస్పీ అధినేత్రి మాయావతి స్పష్టం చేశారు.
Read More :
Raksha Bandhan | ఇంతకు మించిన రాఖీ గిఫ్ట్ ఏముంటుంది.. సోదరుడికి మర్చిపోలేని బహుమతిని ఇచ్చిన సోదరి
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Bilkis Bano
- BJP
- Opposition
- Rakhi
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

