Manipur Issue: విపక్షం వెనకడుగు వేసిందా? కొత్త రూల్ కింద చర్చకు సై అందా?
Manipur issue: రూల్ 167 కింద మణిపూర్ అంశంపై చర్చ చేపట్టేందుకు విపక్షం రెఢీ అయినట్లు తెలుస్తోంది. రాజ్యసభ ఎంపీ జైరాం రమేశ్ తన ట్వీట్లో దీనికి సంబంధించిన ప్రతిపాదన చేశారు. అయితే ఆ రూల్ కింద చర్చకు కేంద్రం అంగీకరించిందా లేదా అన్నది ఇంకా క్లారిటీ లేదు. మణిపూర్ ఇష్యూ వల్ల పార్లమెంట్ ఉభయసభల్లో వాయిదాల పర్వం కొనసాగుతున్న విషయం తెలిసిందే.
న్యూఢిల్లీ: పార్లమెంట్లో కొనసాగుతున్న ప్రతిష్టంభనకు విపక్షాలు చెక్ పెట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. విపక్ష కూటమి ఇచ్చిన కొత్త ప్రతిపాదనతో సభ సజావుగా సాగేందుకు అవకాశాలు ఉన్నట్లు స్పష్టమవుతోంది. మణిపూర్ అంశం(Manipur Issue)పై ప్రధాని మోదీ సభలో ప్రకటన చేయాలని విపక్ష ఎంపీలు భీష్మించుకున్న విషయం తెలిసిందే. అయితే రాజ్యసభలో విపక్ష ఎంపీలు కాస్త తగ్గినట్లు తెలుస్తోంది. ఇవాళ కాంగ్రెస్ ఎంపీ జయరాం రమేశ్ చేసిన ఓ ట్వీట్ ఆ సంకేతాన్ని ఇస్తోంది. ప్రతిష్టంభన తొలిగిపోవడానికి ఇండియా కూటమి మధ్యేమార్గాన్ని ప్రభుత్వానికి సూచించినట్లు ఆయన తన ట్వీట్లో వెల్లడించారు.
మణిపూర్ ఇష్యపై రూల్ 267 కింద సుదీర్ఘ చర్చ చేపట్టాలని, ప్రధాని మోదీ సభలో ప్రకటన చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక రూల్ 176 కింద ఆ అంశంపై చర్చకు సిద్ధమే అని కేంద్రం చెబుతోంది. కానీ పార్లమెంట్ ప్రారంభమై 10 రోజులు గడుస్తున్నా.. సభా కార్యక్రమాలు సజావుగా సాగడం లేదు. వాయిదాల పర్వంతో సమయం అంతా వృధా పోతోంది. ఈ నేపథ్యంలో ఇండియా కూటమి కొత్త ప్రతిపాదన చేసింది. రూల్ 167 కింద చర్చ చేపట్టాలని విపక్షాలు సూచించినట్లు తెలుస్తోంది. అయితే రూల్ 167 కింద ఆ అంశంపై ఓటింగ్ కూడా ఉంటుంది. కానీ ప్రధాని స్టేట్మెంట్పై విపక్షాలు వెనక్కి తగ్గాయా లేదా అన్న అంశంపై మాత్రం ఇంకా క్లారిటీ లేదు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

