పట్టుబడిన పాకిస్థాన్ ఉగ్రవాది.. మరొకరు హతం

శ్రీనగర్: లష్కరే తోయిబాకు చెందిన 19 ఏళ్ల ఉగ్రవాదిని భారత భద్రతా బలగాలు పట్టుకున్నాయి. జమ్ముకశ్మీర్‌లోని ఉరి దగ్గర నియంత్రణ రేఖ వెంబడి జరిపిన ప్రత్యేక ఆపరేషన్‌లో మరో ఉగ్రవాదిని హతమార్చారు. పట్టుబడిన ఉగ్రవాది పాకిస్థాన్‌లోని పంజాబ్‌కు చెందినవాడు. తన పేరు అలీ బాబర్ పాత్రా అని అతడు చెప్పినట్లు మేజర్ జనరల్ వీరేంద్ర వెల్లడించారు. తాను లష్కరే తోయిబా ఉగ్రవాదినని, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ముజఫరాబాద్‌లో తనకు శిక్షణ ఇచ్చినట్లు అతను విచారణలో చెప్పాడు. గత ఏడు రోజులలో ఏడుగురు ఉగ్రవాదులను హతమార్చినట్లు ఇండియన్ ఆర్మీ తెలిపింది.
పాకిస్థాన్ ఆర్మీ సాయం లేకుండా సరిహద్దులో ఇంత మంది కదలికలు అసాధ్యమని, నియంత్రణ రేఖ వెంబడి ఉన్న అన్ని ఉగ్రవాద స్థావరాల్లో కదలికలు ఉన్నాయని మేజర్ వీరేంద్ర చెప్పారు. గత ఫిబ్రవరిలో పాకిస్థాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత నియంత్రణ రేఖ వెంబడి ఇండియన్ ఆర్మీ సాగించిన అతి పెద్ద ఆపరేషన్ ఇదే. ఈ నెల 18 నుంచి ఈ ఆపరేషన్ కొనసాగుతోంది. గత మూడు రోజులలో నలుగురు జవాన్లు కూడా గాయపడ్డారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

