Aircraft crash: భారత వాయుసేన (Indian Airforce) కు చెందిన హాక్ ట్రెయినర్ ఎయిర్‌క్రాఫ్ట్ (Hawk trainer aircraft) మంగళవారం సాయంత్రం ప్రమాదానికి గురైంది. కొత్తగా ఎయిర్‌ఫోర్స్‌లో చేరే సైనికులకు యుద్ధ విమానాలు నడపడంలో శిక్షణ ఇచ్చే ఈ ఎయిర్‌క్రాఫ్ట్ పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని కలైకుందలో ప్రమాదవశాత్తు కూలిపోయింది.
అయితే ప్రమాదాన్ని ముందే పసిగట్టిన పైలట్లు పారాచ్యూట్ల సాయంతో విమానంలోంచి దూకేశారు. ప్రస్తుతం పైలట్ ఇద్దరు క్షేమంగా ఉన్నారని భారత వాయుసేన ప్రకటించింది. ప్రమాదానికిగల కారణాలపై దర్యాప్తు చేసేందుకు కోర్ట్ ఆఫ్ ఎంక్వయిరీ వేసినట్లు ఎయిర్‌ఫోర్స్ తెలిపింది. ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టంగానీ, ఎవరూ గాయపడటంగానీ జరగలేదని వెల్లడించింది.