expired chocolates | గడువు ముగిసిన చాక్లెట్లు తిన్న పాప.. రక్త వాంతులతో ఆసుపత్రిపాలు
expired chocolates | ఏడాదిన్నర వయసున్న పాప గడువు ముగిసిన చాక్లెట్లు తిన్నది. (expired chocolates) రక్తం వాంతులు కావడంతో ఆ చిన్నారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో అమ్మిన షాపులోని గడువు ముగిసిన చాక్లెట్లు, ఇతర తినుబండారాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
చండీగఢ్: ఏడాదిన్నర వయసున్న పాప గడువు ముగిసిన చాక్లెట్లు తిన్నది. (expired chocolates) రక్తం వాంతులు కావడంతో ఆ చిన్నారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో అమ్మిన షాపులోని గడువు ముగిసిన చాక్లెట్లు, ఇతర తినుబండారాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పంజాబ్‌లోని లూథియానాలో ఈ సంఘటన జరిగింది. ఆ చిన్నారి తన కుటుంబంతో కలిసి పాటియాలా వెళ్లింది. సెండాఫ్ సందర్భంగా బంధువులు స్నాక్స్, చాక్లెట్లతో కూడిన బాక్స్‌ను గిఫ్ట్‌గా ఇచ్చారు.
కాగా, లూథియానాకు తిరిగి వచ్చిన తర్వాత బాక్స్‌లోని చాక్లెట్లను ఆ బాలిక తిన్నది. దీంతో ఆ పాపకు రక్తం వాంతులు అయ్యాయి. ఆందోళన చెందిన తల్లిదండ్రులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. గడువు ముగిసిన చాక్లెట్లు తినడం వల్ల ఆ చిన్నారి అస్వస్థతకు గురైనట్లు వైద్య పరీక్షల్లో నిర్ధారించారు. ఆ పాపను ఆసుపత్రిలో అడ్మిట్ చేసి చికిత్స అందిస్తున్నారు.
మరోవైపు గడువు ముగిసిన చాక్లెట్ల అమ్మకం గురించి ఆరోగ్య అధికారులు, పోలీసులకు ఆ పాప బంధువులు ఫిర్యాదు చేశారు. దీంతో వాటిని అమ్మిన షాపును అధికారులు తనిఖీ చేశారు. ఆ షాపులో ఉన్న గడువు ముగిసిన చాక్లెట్లు, ఇతర స్నాక్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కాగా, ఈ ఏడాది మార్చిలో పంజాబ్‌లోని పాటియాలాలో పదేళ్ల బాలిక తన పుట్టిన రోజున కేక్ తిన్నది. ఆ వెంటనే అస్వత్థతకు గురై మరణించింది. పాడై విషపూరితంగా మారిన కేక్ తినడం వల్ల ఆమె చనిపోయినట్లు నిర్ధారించారు. ఆ కేక్ తిన్న బాలిక కుటుంబ సభ్యులు కూడా అనారోగ్యం పాలయ్యారు. అయితే వారు కోలుకున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
TGRTC | ఆర్టీసీ ‘దసరా’ దోపిడీ..! స్పెషల్ బస్సుల్లో 50 శాతం అదనంగా వసూళ్లు
Harishrao | తెలంగాణపై పెనుకుట్ర.. జీసీ లింకు మాటున బాబు-కేంద్రం కుతంత్రం
Medigadda | మేడిగడ్డలో నీళ్లు.. ఎత్తలేక మొసలి కన్నీళ్లు..! రైతాంగ ప్రయోజనాలు మరచి రాజకీయాలు
Horoscope | 18-10-2026 ఆదివారం.. మీ రాశి ఫలాలు
మంత్రులపై కుతంత్రం.. సీనియర్లపై కత్తి గట్టిన ముఖ్యమంత్రి రేవంత్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

