రూపాయి పతనం ఎందుకు..? ఆర్థికమంత్రికి ఎన్సీపీ సూటి ప్రశ్న
Nationalist Congress Party: రోజురోజుకు రూపాయి మారకం విలువ పతనం కావడానికి కేంద్ర ప్రభుత్వమే కారణమని శరద్ పవార్ నేతృత్వంలోని
ముంబై: రోజురోజుకు రూపాయి మారకం విలువ పతనం కావడానికి కేంద్ర ప్రభుత్వమే కారణమని శరద్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) ఆరోపించింది. ఈ మధ్య కాలంలో రూపాయి విలువ వరుసగా పతనమవుతుండటంపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వివరణ ఇవ్వాలని ఎన్సీపీ డిమాండ్ చేసింది.
గత కొన్ని రోజులుగా అమెరికన్ డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ దారుణంగా పడిపోతున్నది. మంగళవారం నాటి ఎర్లీ ట్రేడింగ్‌లో కూడా రూపాయి విలువ 43 పైసలు పతనమై రూ.81.52 వద్ద కొనసాగుతున్నది. బీజేపీ క్యాడర్‌ను బలోపేతం చేయడమే లక్ష్యంగా మూడు రోజులపాటు బారామతిలో పర్యటించిన ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్.. పర్యటన చివరి రోజైన శనివారం పుణెలో మీడియాతో మాట్లాడారు.
రూపాయి పతనాన్ని కేంద్ర ఆర్థిక శాఖ, ఆర్బీఐ చాలా దగ్గరి నుంచి పర్యవేక్షిస్తున్నాయని, మిగతా దేశాల కరెన్సీలతో పోల్చితే అమెరికన్ డాలర్‌తో రూపాయి మారకం విలువ త్వరలోనే మెరుగుపడుతుందని ఆ మీడియా సమావేశంలో నిర్మలా సీతారామన్ చెప్పారు. ఆమె చెప్పిన మరుసటి ట్రేడింగ్‌లోనే రూపాయి భారీగా పతనం కావడంతో ఎన్సీపీ నిలదీసింది. నిర్మలా సీతారామన్ బారామతి కంటే ఎక్కువగా దేశ ఆర్థిక పరిస్థితిపై దృష్టిపెడితే మంచిదని సూచించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

