కరోనా కొత్త రూపం ఒమిక్రాన్ గురించి నిపుణుల అభిప్రాయాలు ఎలా ఉన్నా.. ఈ కొవిడ్ వేరింయంట్పై మిస్టరీ పూర్తిగా వీడలేదు. బెంగుళూరులో నమోదైన తొలి రెండు ఒమిక్రాన్ కేసులలో ఒకరు డాక్టరు కాగా.. మరొకరు దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన వ్యక్తి. ఒమిక్రాన్ సోకిన ఆ బెంగుళూరు డాక్టర్ త్వరగానే కోలుకున్నాడని ఇటీవల మీడియా సమాచారం వచ్చింది.
కానీ సోమవారం ఆ డాక్టర్‌కు కరోనా టెస్టు చేయగా.. అతనికి మళ్లీ పాజిటివ్ వచ్చిందని, ఆ డాక్టర్ ప్రస్తుతం క్వారెంటైన్లో ఉన్నాడని బెంగుళూరు మునిసిపల్ అధికారులు తెలిపారు. ఆ డాక్టర్లో కరోనా లక్షణాలు కనిపించలేదని వారు అన్నారు.
మరోవైపు ఆ దక్షిణాఫ్రికా వ్యక్తిని ఒమిక్రాన్ సోకినందుకు ఒక 5 స్టార్ హోటల్లో ఐసోలేషన్‌లో ఉంచగా.. అతను అక్కడి నుంచి తప్పించుకొని దుబాయ్ పారిపోయాడని తెలిసింది. పోలీసుల ఆ దక్షిణాఫ్రికా వ్యక్తితో పాటు అతను పారిపోయేందుకు సహకరించిన హోటల్ సిబ్బందిపై కేసు నమోదు చేశారు.